సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి సన్‌ఫ్లవర్ సీడ్స్ (పొద్దుతిరుగుడు గింజలు) ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో కేవలం విటమిన్లే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ B2, B3, B6, C, E, K వంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.