డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం.. 

షేర్ చేయండి:
డిజిటల్ యుగంలో యువతలో స్ట్రోక్ కేసులు..పెరగడానికి ఈ అలవాట్లే కారణం.. 

సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో యువతలో స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతు న్నాయి. నేటి డిజిటల్ ప్రపంచంలో 20, 30 ఏళ్ల వయస్సులో ఉన్న యువకులలో భయంకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు వయోవృద్ధులపై తీవ్ర ప్రభావం చూపించిన అనారోగ్య సమస్యలు నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్క్రీన్ పై ఎక్కువగా గడపడం, పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన డైట్ తోపాటు సరైన జీవన శైలి అలవాట్లు లేకపోవడం వల్ల యువతలో స్ట్రోక్ కేసులు పెరగడానికి ప్రధానకారణాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఆహారపుఅలవాట్లలో మార్పులు, జీవనశైలి మార్పులు చేయడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ స్ట్రోక్ సమస్యను నివారించవచ్చని వైద్యులు అంటున్నారు. 

 

పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా?

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

డిజిటల్ అలవాట్లే కారణం.. 

ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ డాక్టర్ నిర్మల్ సూర్య మాట్లాడుతూ.. ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలలో స్ట్రోక్ కూడా ఒకటి. “యువకులు గంటల తరబడి సామాజిక మాధ్యమాలపై గడపడం, శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయడం వంటివి చేస్తుంటారు. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అంతేకాదు దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.

ఇది స్ట్రోక్స్‌కు ప్రధాన కారణం అవుతుంది”అని ఆయన వివరించారు. ముఖ్యంగా స్క్రీన్ పై ఎక్కువగా గడపడం వల్ల శారీరక సమస్యలే కాకుండా, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. దీని ఎఫెక్ట్  భావోద్వేగాలపై కూడా పడుతుందని, "డిజిటల్ ఐసోలేషన్ వల్ల ఏర్పడే ఒంటరితనం ఒత్తిడికి, మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. ఈ రెండూ స్ట్రోక్‌లకు ప్రమాద కారకాలు" అని ఆయన చెప్పారు.

 

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.