విటమిన్ బి6 లోపం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 

షేర్ చేయండి:
విటమిన్ బి6 లోపం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 

సాక్షి లైఫ్ : విటమిన్ బి6 ను పిరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. బి కాంప్లెక్స్ విటమిన్లలో ముఖ్యమైనది ఇది. దీనిని కరిగే విటమిన్ లలో ఒకటిగా భావిస్తారు. ఇది శరీరంలో మెదడు అభివృద్ధి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ. రక్త నాళాల నిర్మాణం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. విటమిన్ బి6 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?


విటమిన్ బి6 లోపం ఉన్నపుడు కనిపించే లక్షణాలు..

అలసట, బలహీనత: శక్తిని అందించడంలో విటమిన్ B6 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బి6 విటమిన్ లోపం కారణంగా బాగా అలసిపోయినట్లు అనిపించడంతోపాటు, బలహీనంగా అనిపిస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలు : చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ B6 కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు వస్తుంది.జీర్ణ సమస్యలు : విటమిన్ B6 జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. దీని లోపం వల్ల మలబద్ధకం, విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నాడీ సంబంధిత సమస్యలు: నాడీ సంబంధిత ఆరోగ్యానికి విటమిన్ B6 కూడా చాలా అవసరం. దీని లోపం వల్ల చేతులు,కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు, నొప్పిగా అనిపించడం జరుగు తుంది. నిద్ర లేకపోవడం: విటమిన్ B6 కూడా నిద్రను నిర్వహించడంలో చాలా సహాయపడుతుంది. దీని లోపం నిద్రలేమి లేదా చెదిరిన నిద్ర వంటి సమస్యలను కలిగిస్తుంది. మానసిక స్థితిలో మార్పులు: మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడంలో విటమిన్ B6 కూడా చాలా సహాయపడుతుంది. దీని లోపం ఆందోళన, నిరాశ, మానసిక స్థితిలో మార్పులకు కారణమవుతుంది.

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.