పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?
సాక్షి లైఫ్ : పగటి భోజనం, రాత్రి భోజనానికి మధ్య మీరు ఎంత గ్యాప్ తీసుకుంటారు? మీరు దీనిపై ఎప్పుడూ శ్రద్ధ చూపకపోతే, ఇప్పుడైనా తప్పనిసరిగా శ్రద్ధ చూపాలని సూచిస్తున్నాయి పలు అధ్యయనాలు. పగటి భోజనం, రాత్రి భోజనానికి మధ్య సరైన విరామం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని జరగవచ్చు. ఈ వ్యాసంలో మనం పగటి భోజనం- రాత్రి భోజనం మధ్య ఎంత సమయం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
భోజనాల మధ్య సరైన సమయన్ని నిర్వహించడం ముఖ్యం. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పగటి భోజనం, రాత్రి భోజనం మధ్య సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.మీరు ఏమి తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో కూడా మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మీకు తెలుసా?
జీర్ణక్రియ : పగటి భోజనం- రాత్రి భోజనం మధ్య తగినంత సమయం ఉండటం వల్ల మన జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది మలబద్ధకం, జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీవక్రియ : క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం వల్ల మన జీవక్రియ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
శక్తి స్థాయిలు : మనం సరైన సమయంలో భోజనం చేసినప్పుడు, రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. నీరసంగా అనిపించదు.
నిద్ర : నిద్రపోయే ముందు కొన్ని గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. తద్వారా శరీరం నిద్రపోయే ముందు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. లంచ్ కు డిన్నర్ కు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధి ఉండడం చాలా అవసరమని చెబుతున్నారు వైద్యనిపుణులు.
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
