కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..    

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లతో పాటు మంచి జీవన శైలి అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది గుండె జబ్బులతో సహా అనేక వ్యాధులకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కొన్ని ఆరోగ్యకరమైన ఉదయం అలవాట్లు అధిక కొలెస్ట్రాల్ సమస్య ను నియంత్రించడంలో సహాయపడతాయి.

తరచుగా సరైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అనేక రకాల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి, ఇది కొన్నిసార్లు తీవ్రమైతే ప్రాణాంతకం కావచ్చు.

 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు ,ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం దినచర్యలో కొన్ని అలవాట్లను చేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.  

కాఫీకి బదులుగా గ్రీన్ టీ.. 

చాలా మంది ఉదయం లేవగానే ముందుగా కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. అయితే, మీరు మీ ఉదయం కాఫీని గ్రీన్ టీతో భర్తీ చేస్తే, మీకు అనేక  ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీలో కొన్ని యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

స్వీట్లకు దూరంగా ఉండాలి..

ఉదయాన్నే తీపి పదార్థాలు తినడం మానుకోండి. ఉదయం స్వీట్లు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీకు ఇంకా తీపి తినాలని అనిపిస్తే, చక్కెరకు బదులుగా తేనె, బెల్లం లేదా తీపి పండ్లను ఎంచుకోవడం మంచిది.

గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు..  
 
ఆరోగ్యంగా ఉండడానికి పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమ ఎంపిక. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో మీరు అందులో నిమ్మకాయ రసం పిండుకుని తాగితే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఉదయం నడక..  

ఉదయం లేచి నడవడం వల్ల అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.  

ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం.. 

ఉదయం తీసుకునే అల్పాహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా రోజూ అల్పాహారం తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించు కోవాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం తినాలి. దీని కోసం మీరు మీ ఆహారంలో ఓట్స్, పండ్లు, గింజలను చేర్చుకోవాలి.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bad-cholesterol eating-habits morning healthy-habit food-habits good-cholesterol cholesterol how-to-lower-cholesterol how-to-reduce-cholesterol how-to-lower-cholesterol-naturally high-cholesterol cholesterol-control lower-cholesterol lower-bad-cholesterol-naturally how-to-lower-ldl-cholesterol foods-to-lower-cholesterol cholesterol-lowering-foods ldl-cholesterol lower-cholesterol-naturally cholesterol-control-food hdl-cholesterol foods-that-lower-cholesterol symptoms-of-high-cholesterol best-tips-for-morning-walk
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com