అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి..?   

షేర్ చేయండి:
అమైనో ఆమ్లాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి..?   

సాక్షి లైఫ్ : అమైనో ఆమ్లాలు శరీరానికి బిల్డింగ్ బ్లాక్‌లుగా పనిచేస్తాయి. ఇవి జీర్ణక్రియ, కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, చర్మ సంరక్షణకు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, శరీర మరమ్మత్తుకు సహాయపడుతాయి. అమైనో ఆమ్లాలు మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. వీటి లోపం వల్ల బలహీనత, అలసట వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

 

ఇది కూడా చదవండి..వైద్యుని సలహా లేకుండా గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..? 

ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?

ఇది కూడా చదవండి..ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..ఏమేం విటిమిన్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..?

 

అమైనో ఆమ్లాలు ఆరోగ్య ప్రయోజనాలు..  

శరీరం బలమైన భవనం అయితే, దానిని నిర్మించే ఇటుకలే అమైనో ఆమ్లాలు. ఇవి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా మెదడు, ఎముకలు, చర్మం, జీర్ణవ్యవస్థ సరైన పనితీరుకు కూడా అవసరం. అయితే ప్రస్తుతం సరిగాలేని ఆహారపు అలవాట్లు, అనారోగ్యకర మైన జీవనశైలి కారణంగా, చాలా మంది శరీరంలో అమైనో ఆమ్ల లోపంతో బాధపడుతున్నారు. 

అమైనో ఆమ్లాలు లోపించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. బలహీనత, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరాన్ని ఫిట్‌గా, శక్తివంతంగా ఉంచుకోవాలనుకుంటే రోజువారీ ఆహారంలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం చాలా అవసరం. 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.