భార్య, భర్తల్లో ఒకరికి బీపీ ఉంటే..? మరొకరిపై దాని ప్రభావం ఎలా ఉంటుందా..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన 20 శాతం భార్య, భర్తల్లో ఇద్దరు హైబీపీతో బాధపడుతున్నట్లు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. హైబీపీ లేని వారిని పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే..హై బీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో వెల్లడైంది.
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
నేడు మారిన జీవన శైలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం యువతపై కూడా దాని ప్రభావం పడుతోంది. అంతేకాదు దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు(హైబీపీ) సమస్య ఉన్నా రెండో వ్యక్తికి వచ్చే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. పలు యూనివర్సిటీలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఇంగ్లాండ్, అమెరికా, చైనా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
సర్వేలో గుర్తించిన అంశాలేంటి..?
మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యా లయాలు 2015–19 మధ్య ఒక అధ్యయనం చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌లో 1,086, యూఎస్‌ఏలో 3,989, చైనాలో 6,514, భారత్‌లో 22,389 జంటల ఆరోగ్యాన్ని పరిశోధ కులు విశ్లేషించారు. వీరంతా యూఎస్‌ఏ, ఇంగ్లాండ్ దేశాల్లో 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ, చైనా, భారత్‌లో 45 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారే ఉన్నారు.
ఇంగ్లాండ్‌లో 47.1శాతం, యూఎస్‌లో 37.9 శాతం, చైనాలో 20.8శాతం, భారత్‌లో 19.8 శాతం దంపతులు హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చైనా, భారత్ దేశాల్లో భార్య, భర్తల్లో ఏ ఒక్కరికి సమస్య ఉన్నా రెండోవారు కూడా దాని బారినపడే పరిస్థితి బలంగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
హైబీపీ లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్న మహిళల తో పోలిస్తే.. సమస్య ఉన్నవారిని వివాహం చేసుకున్న మహిళలు హైబీపీ బారినపడటానికి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో 9శాతం ఎక్కువ అవకా శం ఉందని నిర్ధారించారు. చైనాలో అయితే ఏకంగా 26శాతం ఉన్నట్టు వెల్లడించారు.
పురుషుల విషయంలోనూ ఇలాగే జరుగుతుండటం గమనార్హమని పరిశోధకులు తెలిపారు. భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధాలు, ఇష్టాయిష్టాలు, ఒకరిపై మరొకరు ఆధారపడటం, జీవ నశైలి, ఇతర అంశాలు ఆరోగ్యం మీద పరస్పర ప్రభావాన్ని చూపుతున్నట్లు అంచనా వేశారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
