చలికాలంలో మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : మెదడు మెలకువగా, చురుకుగా ఉండటానికి సూర్యరశ్మి చాలా ముఖ్యం. కంటి చూపులేని వారికి కూడా, ఉదయం పూట కాంతి అవసరసం. తద్వారా మెదడు పగలు, రాత్రి సరైన ఆలోచనను పొందగలదు. తదనుగుణంగా శరీరం మిగిలిన పనులను నిర్వర్తిస్తుంది. మన శరీరంలోని ప్రతి కణానికి కాలానికి సంబంధించిన సమాచారం అవసరం. తద్వారా అది పగలు- రాత్రి ప్రకారం సరిగ్గా పని చేస్తుంది. నోటి ఎగువ భాగంలోని ప్రత్యేక న్యూరాన్లు (సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్) గడియారం లాగా, శరీరంలోని ఇతర కణాలకు పగలు- రాత్రి గురించి చెబుతాయి.
బ్రెయిన్ కు..
సూర్యరశ్మి మెదడుకు నేరుగా చేరదు. కాకపోతే మన కళ్ళ వెనుక భాగంలో మెలనోప్సిన్ గ్యాంగ్లియన్ కణాలు అని పిలిచే ప్రత్యేక రకాల కణాలు ఉన్నాయి. ఇవి సూర్యరశ్మికి స్పందిస్తూంటాయి. పగలు- రాత్రి గురించి మెదడుకు తెలియజేస్తాయి.
అయితే ఉదయాన్నే మనకు సూర్యకాంతి అందకపోతే..? లేదా మనం ఎక్కువ సేపు సూర్యకాంతి లేకుండా ఉంటే..? నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనస్తత్వవేత్తలు సూర్యరశ్మి మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిద్ర, చురుకుదనంపై సూర్యకాంతి అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని "స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజీ ప్రొఫెసర్ ఆండ్రూ హుబెర్‌మాన్" చెబుతున్నారు. మనం ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని గ్రహించినా చూడకున్నా రాత్రిపూట నిద్రపై ప్రభావం కచ్చితంగా చూపుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగా శీతాకాలంలో కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని, దీనిని వింటర్ డిప్రెషన్ లేదా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు"అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
శీతాకాలంలో డిప్రెషన్ ను నివారించడానికి, దాని కారణాలను మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి మంది ప్రజలు శీతాకాలపు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సహజంగా ఈ సీజన్ లో ప్రజలు చలికి పని చేయడానికి ఇష్టపడరు.
నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చలి కారణంగా సోమరితనం పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. కానీ మారుతున్న వాతావరణంతో మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. కొంతమందిలో ఇది డిప్రెషన్ రూపంలో కూడా ఉంటుంది. వింటర్ సీజన్ లో డిప్రెషన్ నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
శీతాకాలంలో ప్రతి ఉదయం ఎండలో ఉండటం ఎందుకు ముఖ్యం..?
"ఉదయం నిద్రలేచి సూర్యరశ్మిలోకి వెళ్లగానే మెదడు నుంచి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలవుతుందని, ఇది చురుకుగా ఉండటానికి సిద్ధం చేస్తుందని" ప్రొఫెసర్ ఆండ్రూ వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
