గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..  

షేర్ చేయండి:
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..  

సాక్షి లైఫ్ : వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇవి పలురకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఆయుర్వేదం వైద్యంలో దీనిని అనేక చికిత్సలలో ఉపయోగిస్తారు. వెల్లుల్లి ఘాటైన వాసన, విలక్షణమైన రుచిని ఇస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లులి మించినది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అంతబాగా పనిచేస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందని అనేక పరిశోధనలు సైతం వెల్లడించాయి. వెల్లుల్లి ప్లేట్‌లెట్‌లను ఒకదానితో ఒకటి కలిసిపోయి ధమని గోడలపై పేరుకుపోయేలా చేస్తుంది. అలా చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

 రక్తపోటును నిర్వహించడంలో..  

వెల్లుల్లి రక్త నాళాలను విస్తరించే సామర్థ్యం కలిగి ఉంటుంది, తద్వారా రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అప్పుడు రక్తాన్ని మరింత సులువుగా ప్రవహించేలా చేస్తుంది.

 క్యాన్సర్ నిరోధక లక్షణాలు..  

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిరోధించడంతోపాటు  కణితులను నిర్మూలించ గలిగే సామర్థ్యం ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, అన్నవాహిక క్యాన్సర్‌లను నియంత్రించడంలో వెల్లుల్లి ఎంతో ఉపకరిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.