4-7-8 బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ అంటే ఏమిటి..? నిద్రకు ఎలా ఉపయోగపడుతుంది..?  

షేర్ చేయండి:
4-7-8 బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ అంటే ఏమిటి..? నిద్రకు ఎలా ఉపయోగపడుతుంది..?  

సాక్షి లైఫ్ : నేటి కాలంలో ప్రజల జీవనశైలి చాలా దిగజారిపోయింది. దీనివల్ల చాలామంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీని కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు సర్వసాధారణమైపోతున్నాయి. దీని ప్రభావం మన మానసిక ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. నిద్రలేమి సమస్య అంటే "ఇన్సోమియా" ను  ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

అటువంటి పరిస్థితిలో కొందరు తప్పుడు పద్ధతులను అవలంబిస్తారు. అందులో భాగంగా చాలా మంది తాగుతారు, మరికొందరు నిద్ర మాత్రలు తీసుకుంటారు. ఇలాంటివి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే 4-7-8 టెక్నిక్ ద్వారా నిద్రలేమి సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

4-7-8 బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ అంటే ఏమిటి..?

 ఇది శ్వాస రేటును నియంత్రించడం ద్వారా శరీర నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇందులో మూడు ప్రధాన దశలు ఉన్నాయి. 4 సెకన్ల పాటు గాలి పీల్చాలి, తర్వాత 7 సెకన్ల పాటు శ్వాసను ఆపాలి, ఆపై 8 సెకన్ల పాటు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదిలాలి. దీన్ని కనీసం 4 సార్లు పునరావృతం చేయాలి, ఇది ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. ఇది డాక్టర్ ఆండ్రూ వీల్ అనే అమెరికన్ వైద్యుడు అందించిన 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్ సైజ్.

 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.