యూరిక్ యాసిడ్ ఎంత ఉంటే నార్మల్..?
సాక్షి లైఫ్ : యూరిక్ యాసిడ్ కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కొన్నిసమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగితే, అది శరీరంలోని చిన్న కీళ్లలో పేరుకుపోయి గౌట్ సమస్యను కలిగిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీల వైఫల్యానికి దారితీయవచ్చు. కాబట్టి యూరిక్ యాసిడ్ ఎంత ఉంటే నార్మల్..? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. చిన్న సూదితో రోగాలు నయమవుతాయా..?
పురుషుల్లో..
యురిక్ యాసిడ్ 3.5 నుంచి 7 mg/dL వరకు వయోజన పురుషుల శరీరంలో సాధారణమైనదిగా పరిగణిస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే..? దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. యూరిక్ యాసిడ్ సమస్యను ముందుగానే గుర్తిస్తే, కొన్ని నెలల్లో పూర్తిగా సాధారణ స్థాయికి తీసుకురావచ్చు.
మహిళల్లో..
యూరిక్ యాసిడ్ మన శరీరానికి అవసరమైన మూలకం.అయితే దాని పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా ఉంటే, అది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా, వయోజన మహిళల్లో యూరిక్ యాసిడ్ 2.5 నుంచి 6 mg/dL మధ్య ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణిస్తారు. ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ దాని పర్యవేక్షణ చాలా ముఖ్యమని యూరాలజిస్టులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
ఇది కూడా చదవండి.. ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
