Hip Dysplasia : 'హిప్ డిస్ప్లేసియా' అంటే ఏమిటి..? ఇది ఎలాంటి వాళ్లకు వస్తుంది..? 

షేర్ చేయండి:
Hip Dysplasia : 'హిప్ డిస్ప్లేసియా' అంటే ఏమిటి..? ఇది ఎలాంటి వాళ్లకు వస్తుంది..? 

సాక్షి లైఫ్ : పిల్లలు అడుగులేస్తుంటే చూడటం ఏ తల్లిదండ్రులకైనా ముచ్చటగా ఉంటుంది. కానీ, ఆ అడుగులు తడబడినా లేదా నడకలో తేడా ఉన్నా వెంటనే అప్రమత్తం కావాలి. ఇటీవల బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన ఏడాదిన్నరేళ్ల కుమార్తె 'లారా'కు హిప్ డిస్ప్లేసియా (Hip Dysplasia) కారణంగా శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుంటున్నప్పటికీ, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దీనిని గుర్తించడం ఎలా..? అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

ఏమిటీ హిప్ డిస్ప్లేసియా..?

సాధారణంగా మన తుంటి కీలు 'బంతి-గిన్నె' (Ball and Socket) మాదిరిగా ఉంటుంది. తొడ ఎముక పైభాగం, తుంటి ఎముకలోని గుంతలో సరిగ్గా అమరినప్పుడే కీలు సక్రమంగా పనిచేస్తుంది. అయితే, హిప్ డిస్ప్లేసియా ఉన్నవారిలో ఈ సాకెట్ తక్కువ లోతుగా ఉండటం వల్ల ఎముకలు సరిగ్గా అమరవు. దీనినే వైద్య పరిభాషలో 'డెవలప్‌మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ ది హిప్' (DDH) అని పిలుస్తారు.

ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు..?

 గర్భంలో శిశువు ఉన్న స్థితిని బట్టి తుంటి ఎముకలపై ఒత్తిడి పడి అవి సరిగ్గా పెరగకపోవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మగపిల్లల కంటే ఆడపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మొదటి సంతానంలో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.

లక్షణాలను గుర్తించడం ఎలా..? 

చిన్నపిల్లల్లో ఈ సమస్యను గుర్తించడానికి తల్లిదండ్రులు కొన్ని అంశాలను గమనించాలి.  బిడ్డ నడిచేటప్పుడు కుంటుతున్నట్లు అనిపించడం. ఒక కాలు పొట్టిగా, మరొకటి పొడవుగా ఉన్నట్లు కనిపించడం. తుంటి కీలు అస్థిరంగా ఉండటం లేదా కదిలించినప్పుడు శబ్దం రావడం.తొడ పైభాగంలో లేదా తుంటిలో నొప్పి రావడం వల్ల బిడ్డ సరిగ్గా కదలలేకపోవడం.

చికిత్స..?

చాలా సందర్భాలలో బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల్లోనే వైద్యులు సాధారణ పరీక్షల ద్వారా దీనిని గుర్తిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ప్రత్యేక బెల్టులు (Harness) లేదా వరుణ్ ధావన్ కుమార్తెకు చేసినట్లుగా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. సకాలంలో గుర్తిస్తే ఎముకల వంకరను సరిచేసి బిడ్డ భవిష్యత్తులో సాధారణంగా నడిచేలా చేయవచ్చు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.