ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితి ఎలా ఉంది..?  

సాక్షి లైఫ్ : ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న JN.1 వేరియంట్ ఒమిక్రాన్ BA.2.86 ఫ్యామిలీకి చెందినది. సింగపూర్: ఏప్రిల్ చివరిలో 11,100 కేసులు నమోదు కాగా, మే మొదటి వారం నాటికి 14,200 కేసులకు పెరిగాయి. ఇది సుమారు 28శాతం పెరుగుదలగా భావించాలి.

ఇది కూడా చదవండి.. ప్రాణాలపై పంజా విసురుతున్న పామాయిల్.. 

ఇది కూడా చదవండి.. గుండె సంబంధిత సమస్యలు ముదరకుండా ఉండాలంటే..? 

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

హాంగ్‌కాంగ్: మే మొదటి వారంలో 31 మరణాలు నమోదవడం గమనార్హం. గత ఏడాదిలో ఇదే అత్యధికం. కేసుల సంఖ్య కూడా ఒక్క వారంలోనే 972 నుంచి 1,042కి పెరిగింది.

JN.1 వేరియంట్ కేసులు.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ఓ) డిసెంబర్ 2023లో ఈ వేరియంట్‌ను "వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్"గా ప్రకటించింది. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. LF.7 అండ్ NB.1.8 అనే సబ్ వేరియంట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.


కరోనా కేసులు పెద్దగా పెరగకముందే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనివారు సూచిస్తున్నారు. ఈ వైరస్ గురించి భయపడకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : jn1-omicron omicron-variants symptoms-jn1-variant jn1 deaths-covid-19 covid-19-cases jn-1-new-cases covid-19 who covid-19-variant omicron-variant omicron-covid-19-variant omicron-covid-variant covid-omicron-variant coronavirus new-coronavirus coronavirus-outbreak omicron hongcong jn.1-variant omicron-subvariant singapore-covid-spike
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com