వేసవికాలంలో నడవడానికి సరైన సమయం ఏది..? 

షేర్ చేయండి:
వేసవికాలంలో నడవడానికి సరైన సమయం ఏది..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి నడక సులభమైన మార్గాలలో ఒకటి. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ నడవడానికి సరైన సమయం తెలుసుకోవాలి, ముఖ్యంగా వేసవిలో ఏ సమయంలో నడిస్తే మంచిది..? వైద్యనిపుణులు ఏమి చెబుతున్నారు..? ఎప్పుడు నడిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ కారణంగా కాలేయానికి హాని ఎలా కలుగుతుంది..?

ఇది కూడా చదవండి..Mental health : డిప్రెషన్ కు కాలేయానికి ఏమైనా లింక్ ఉందా..?  

ఇది కూడా చదవండి..హోమియోపతి, అల్లోపతి మందులను ఎందుకు కలిపి తీసుకోకూడదు..?

 

  వేసవిలో..
 
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వేసవి కాలంలో నడిచేటప్పుడు హైడ్రేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, సరైన సమయంలో నడవడం చాలా ముఖ్యం, లేకుంటే అది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు, ముఖ్యంగా వేసవి కాలంలో వాకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు వెల్లడిస్తున్నారు..  

 సరైన సమయం..?

వేసవికాలంలో సాయంత్రం పూటకంటే, ఉదయం సమయంలోనే నడకకు ఉత్తమంగా పరిగణిస్తారు. ఉత్తమ సమయం ఉదయం 5:30 నుంచి 7:30 గంటల మధ్య, ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. గాలి ఎక్కువగా కలుషితం కాదు. విటమిన్ "డి" ఉదయం సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది, ఇది ఎముకలకు మేలు చేస్తుంది.

ఒకవేళ మీరు ఉదయం నడవలేకపోతే, సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం నడవవచ్చు. కానీ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల లోపు నడవ కూడదు, ఎందుకంటే ఈ సమయంలో తీవ్రమైన వేడి, అతినీలిలోహిత కిరణాలు ఆరోగ్యానికి హానికలిగించే ప్రమాదం ఉంది.

 

ఇది కూడా చదవండి..గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి ఇవే అసలు కారణాలు..

ఇది కూడా చదవండి..ఏ సీజన్ లో కీళ్లనొప్పులు ఎక్కువగా వస్తాయి..? కారణాలేంటి..?

ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.