ఏ సీజన్ లో కీళ్లనొప్పులు ఎక్కువగా వస్తాయి..? కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : వింటర్ సీజన్ లో చలి తీవ్రత పెరగడంవల్ల ఆ ప్రభావం ఎముకలపై పడుతుంది. చల్లదనానికి కీళ్ల మధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు కూడా బిగుసుకు పోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి.
ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే..?
ఇది కూడా చదవండి..దాల్చిన చెక్క నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఇది కూడా చదవండి..డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ 5 చిట్కాలు..
అందుకే ఈ సీజన్‌లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు.
వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. కొందరికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది.
కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుంచి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.
గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు..
అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగ పడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.
కీళ్లు మరీ బలహీనంగా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ "డి" మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకు నేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ "డి" లోపం ఏర్పడుతుంది.
విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ "డి" సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డీహైడ్రేషన్..
కీళ్ల నొప్పులున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది. చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంతగా నీళ్లు తాగడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..దృష్టిని మెరుగుపరచడానికి ఎన్ని లీచ్ థెరపీ సెషన్లు అవసరం..?
ఇది కూడా చదవండి..పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు ఏమైనా లింక్ ఉందా..?
ఇది కూడా చదవండి..లీచ్ థెరపీ అంటే ఏమిటి..? కంటి చూపును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో దీనిని ఎలా ఉపయోగిస్తారు?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
