Typhus : అసలు ఏమిటీ టైఫస్..? ఎలా వ్యాపిస్తుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టైఫస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇన్‌ఫెక్షన్ ఉన్న గజ్జి పురుగులు (Fleas) కుట్టడం వల్ల ఇది మనుషులకు సంక్రమిస్తుంది. ఎలుకలు, వీధి పిల్లులు, ఒపోసమ్స్ వంటి జంతువులపై ఈ పురుగులు జీవిస్తాయి. నేరుగా సంబంధం లేకపోయినా.. పెంపుడు జంతువులపై ఈ పురుగులు ఉన్నా, లేదా మీ ఇంటి పరిసరాల్లో వన్యప్రాణులు తిరుగుతున్నా మీరు ప్రమాదంలో ఉన్నట్లే. జంతువులకు జబ్బు చేయకపోయినా, వాటిపై ఉన్న పురుగులు మనుషులకు వ్యాధిని అంటిస్తాయి. ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు.

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

అవయవాలు దెబ్బతినే ప్రమాదం..!

కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇది కౌంటీలోని అన్ని ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది" అని వైద్యనిపుణు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే బహుళ అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వారు వెల్లడిస్తున్నారు. 

లక్షణాలు ఎలా ఉంటాయి..?

పురుగు కుట్టిన ఒకటి లేదా రెండు వారాల తర్వాత టైఫస్ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణే మార్గం.. 

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఏడాది పొడవునా 'ఫ్లీ కంట్రోల్' మందులు వాడాలి. ఇంటి చుట్టూ పిచ్చిమొక్కలు లేకుండా చూడాలి. ఎలుకలు చేరకుండా చెత్త కుండీలను మూసి ఉంచాలి.పెంపుడు జంతువుల ఆహారాన్ని బయట పడేయకూడదు. అది వన్యప్రాణులను, ఎలుకలను ఆకర్షిస్తుంది. బయట తిరిగే జంతువులను ముట్టుకోవడం లేదా వాటికి ఆహారం పెట్టడం మానుకోవాలి.

చికిత్స ఎలా అంటే..?

 టైఫస్‌ను గుర్తించిన వెంటనే 'డాక్సీసైక్లిన్' వంటి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తీవ్రమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.