థైరాయిడ్ ఎఫెక్ట్ ఏ అవయవాలపై ఎక్కువగా ఉంటుంది..?
సాక్షి లైఫ్: థైరాయిడ్ అనేది మన గొంతు ప్రాంతంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. శరీరానికి చాలా అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్ తక్కువైనా, ఎక్కువైనా కూడా ప్రమాదమే. థైరాయిడ్ హార్మోన్ గుండె శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే శక్తిని ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
అంతేకాదు.. రక్తపోటు, రక్తంలోని కొలెస్ట్రాల్ మోతాదులపై కూడా ఈ హార్మోన్ ప్రభావం ఉంటుంది. ఫలితంగా థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోతే గుండె జబ్బులను పోలిన లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. గుండెజబ్బు ఉన్న వారి ఆరోగ్య స్థితి మరింత దిగజారుతుంది.
జీవక్రియలతోపాటు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రతలను కూడా నియంత్రించే అద్భుతమైన శక్తి ఈ చిన్న గ్రంధి సొంతం. అయితే శరీర అవసరాలకు తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేసినా, చేయకున్నా కూడా శరీరంలో పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
