మార్నింగ్ వాక్ చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

షేర్ చేయండి:
మార్నింగ్ వాక్ చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

సాక్షి లైఫ్ : మార్నింగ్ వాక్ అనేది శరీర ఆరోగ్యం కోసం అత్యంత ప్రయోజనకరమైన వ్యాయామం. ఇది గుండె, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, మార్నింగ్ వాక్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మార్నింగ్ వాక్ ఉత్తమ ఎంపికగా భావిస్తారు. ప్రతి రోజూ ఉదయాన్నే నడకకు వెళ్లడం ద్వారా శరీరం ఫిట్‌గా ,చురుకుగా ఉంటుంది. అయితే మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మోకాళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వస్తాయని మీకు తెలుసా..? అవేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

  
మార్నింగ్ వాక్ టైంలో..  
 
ఉదయాన్నే నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, మీ మోకాళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు మోకాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మార్నింగ్ వాక్ చేయడంవల్ల మోకాలి కండరాలు దృఢంగా ఉంటాయి. అంతేకాదు మోకాలి క్వాడ్రిస్ప్స్ , హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను యాక్టివేట్ చేస్తుంది. వాకింగ్ సమయంలో మీరు సరైన బూట్లు ధరించకపోయినా, ఏటవాలుగా ఉన్ననేలపై నడవడం లేదా మీరు అనుసరించే వాకింగ్ టెక్నిక్ సరైనది కానట్లయితే, మీ మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడి మోకాలి సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

ముఖ్యంగా మోకాలి నొప్పి, వాపు లేదా ఇతర మోకాలి సంబంధిత సమస్యల ప్రమాదాలు తలెత్తుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితిలో మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మార్నింగ్ వాక్ చేయడంవల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ.  

మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?

సరైన బూట్లు ఎంచుకోవడం.. 

సరైన బూట్లు మీ మోకాళ్లకు రక్షణ అందిస్తాయి. మంచి బూట్లు అంటే తగినంత వంపు మద్దతు, పాడింగ్ కలిగి ఉంటాయి. ఇవి నడుస్తున్నప్పుడు పాదాలకు అసౌకర్యాన్ని కలిగించవు. దీనితో పాటు, మీ పాదాలు, మోకాళ్లపై ఒత్తిడి లేకుండా, షూల పరిమాణం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
 

నెమ్మదిగా .. 

తక్కువ దూరంతో  నడక ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువ దూరం నడవడం వల్ల మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి క్రమంగా దూరంతోపాటు నడక సమయాన్ని పెంచండి.


 నడుస్తున్నప్పుడు.. 

 నడుస్తున్నప్పుడు మీ పాదాలను సరిగ్గా ఉంచండి. పాదాన్ని పూర్తిగా కిందకు ఉంచే బదులు, తేలికగా అడుగులు వేయండి. మోకాళ్లను నిటారుగా ఉంచండి. దీంతో మోకాళ్లపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది.

ప్రదేశం.. 

 నడక కోసం మృదువైన, చదునైన ఉపరితలాన్ని ఎంచుకోండి. కాంక్రీటు లేదా ఇతర గట్టి ఉపరితలాలు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. పార్కులో లేదా పచ్చని గడ్డిపై నడవడం మోకాళ్లకు చాలా మంచిది.

స్ట్రెచింగ్ -వార్మప్..

 నడకకు ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేయండి. క్వాడ్రిస్ప్స్ , హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను సాగదీయడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. 
అంతేకాదు కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. లైట్ వార్మప్ శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

 బరువును అదుపులో ఉంచండి.. 

మీ బరువును అదుపులో ఉంచండి. ఎందుకంటే అధిక బరువు మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మీ బరువును అదుపులో ఉంచడానికి వీలవుతుంది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  


 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.