హెచ్‌ఎంపీవీ వైరస్.. సోకకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?  

షేర్ చేయండి:
హెచ్‌ఎంపీవీ వైరస్.. సోకకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?  

సాక్షి లైఫ్ : హెచ్‌ఎంపీవీ వైరస్ ను నిరోధించడానికి వ్యక్తిగత శుభ్రతతోపాటు అప్రమత్తత, నివారణ చర్యలు తీసుకోవడం అవసరం అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), హైదరాబాద్, బంజారా హిల్స్ శాఖ ' డాక్టర్ ప్రభు కుమార్ చల్లగలి అన్నారు. హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్‌ఎంపీవీ) ముప్పును ఎదుర్కోవడానికి ఐఎంఏ, హైదరాబాద్, బంజారా హిల్స్ శాఖ 'నమస్కారం ముద్దు-హ్యాండ్‌షేక్ వద్దు' అనే స్లోగన్ ను ఫాలోఅవ్వమని ప్రచారం చేస్తోంది.

షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బదులుగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం ద్వారా కొంతవరకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తాకకుండా ఉండొచ్చు. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల హెచ్‌ఎంపీవీ వ్యాధులు ప్రబలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.  

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

 సహజంగానే శీతాకాలంలో ప్రధానంగా వృద్ధులు, పిల్లలను ప్రభావితం చేసే సీజనల్ ఫ్లూ వంటి లక్షణాలు పెరుగుతాయని, ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులు నియంత్రణలో ఉన్నాయని, ఇలాంటి వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు డాక్టర్ ప్రభు కుమార్. వ్యక్తిగత స్థాయిలో అప్రమత్తత, నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు.  

 
హ్యూమన్ మెటానిమోవైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటే..? 

• తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మీ నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూను అడ్డు పెట్టుకోవాలి.  

• సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోండి.

• రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భౌతిక దూరం పాటించండి.

• పుష్కలంగా నీరు తాగండి, పోషకమైన ఆహారం తీసుకోండి. గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.

• అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి.

• సొంతంగా మందులను అస్సలు వాడకండి..హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.

• ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవడం మంచిది.  

 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు.. 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.