సాక్షి లైఫ్ : టెస్టోస్టెరాన్ అనేది ఒక మగ హార్మోన్. ఇది వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. కండరాలను పటిష్టంగా ఉంచడమే టెస్టోస్టెరాన్ పని. అంతేకాదు ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఆరోగ్యకరమైన మగ సంతానోత్పత్తిని నిర్వహించడానికి కూడా పనిచేస్తుంది. పురుషులలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టెస్టోస్టెరాన్ సరైన స్థాయిని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి తక్కువగా ఉంటే, వారు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. కాబట్టి టెస్టోస్టెరాన్ పెంచడానికి ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగాలంటే..?
గుడ్లు..
గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అదనంగా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరం. టెస్టోస్టెరాన్‌ను పెంచడానికి పురుషులు రోజూ ఒక గుడ్డు తీసుకోవాలని పోషకాహారనిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజూ గుడ్డు తింటే టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.
ఆకు కూరలు..
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో తప్పనిసరిగా ఆకు కూరలను చేర్చుకోవాలి. ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ తోపాటు విటమిన్లు కూడా ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నపురుషులు ఆకు కూరలు తినాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల టెస్టోస్టెరాన్ లెవల్స్ పెరుగుతాయి. ఇది సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు మీ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
పాలు లేదా పాల ఉత్పత్తులు..
పాలు లేదా పాల ఉత్పత్తులు ఎముకలకు చాలా ముఖ్యం. పాలు కాల్షియానికి అద్భుతమైన మూలం. అంతే కాకుండా పాలలో విటమిన్ "డి" పుష్కలంగా లభిస్తుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ఇవి చాలా బాగా ఉపకరిస్తాయి. టెస్టోస్టెరాన్ పెంచడానికి, మీ ఆహారంలో పాలు లేదా పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి.
దానిమ్మ..
దానిమ్మలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దానిమ్మపండు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది కాకుండా దానిమ్మలో సంతానోత్పత్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మంచి మూలం దానిమ్మ. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచడానికి, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో దానిమ్మను చేర్చుకోవాలి.
అవకాడో..
అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఇది హార్మోన్ల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, బోరాన్ అనే ఖనిజాలు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి తక్కువగా ఉంటే, మీ రెగ్యులర్ డైట్‌లో అవకాడోను చేర్చుకోండి.
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి..ఎలా పరుగెత్తడం వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com