ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..

షేర్ చేయండి:
ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..

సాక్షి లైఫ్ : మన శరీరంలోని హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ సరిపోను లేకపోతే పలురకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎంత ఉండాలంటే..? పురుషుల్లో 14-18 గ్రాములు, స్త్రీలలో 12-16 గ్రాములు ఉండాలి. ఇది తగ్గిపోతే శరీరంలో బలహీనత, అలసట, తలనొప్పి, శ్వాసలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి..కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..?

ఇది కూడా చదవండి..పరిశోధన : లంకణం పరమౌషధమే.. ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి..ప్రపంచవ్యాప్తంలో కాలుష్యం కారణంగా ఏటా ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..? 

 

హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల.. 

 

హిమోగ్లోబిన్ లోపం రక్తహీనత (అనీమియా)కి కారణం అవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోతే శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి, అవయవాలు సరిగా పనిచేయవు. ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువగా  కనిపిస్తుంది. ఇది ఐరన్ లోపంతో సంబంధం కలిగి ఉంటుంది. ఐరన్, బి విటమిన్లు, విటమిన్ సి వంటి పోషకాలు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం.

హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు.. 

1. పాలకూర: పాలకూరలో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది.

2. బీట్‌రూట్: బీట్‌రూట్ లోని నైట్రేట్లు ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం మంచి పరిష్కారం.

3. యాపిల్: రోజూ ఒక యాపిల్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుంది.

4. దానిమ్మ: దానిమ్మలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.

5. ఖర్జూరం: ఖర్జూరాలు ఐరన్ సమృద్ధిగా కలిగి ఉండి, హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి.

6. నారింజ: విటమిన్ సి అధికంగా ఉండే నారింజలు, టమోటాలు వంటి ఆహారాలు ఐరన్ శోషణను పెంచుతాయి.

7. వేరుశెనగలు, ఆకుకూరలు: ఫోలిక్ యాసిడ్ శరీరంలో ఎర్ర రక్త కణాల తయారికి అవసరం. వేరుశెనగలు, ఆకుకూరలు ఫోలిక్ యాసిడ్‌కు మంచి మూలాలు.

8. విశ్రాంతి.. ఆరోగ్యంగా ఉండటానికి విశ్రాంతి కూడా చాలా అవసరం. అందుకోసం కంటి నిండా నిద్ర పోవాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఆహారంలో ఈ పదార్థాలను చేర్చడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.