ప్రపంచవ్యాప్తంలో కాలుష్యం కారణంగా ఏటా ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణ కాలుష్యం మానవ ఆరోగ్యాన్నేకాకుండా ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఇటీవల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. వాతావరణ సంక్షోభానికి ఆజ్యం పోస్తున్న పొల్యూషన్ కారణంగా భూమి మరింతగా వేడెక్కుతోంది. నేడు జనాభాలో 99 శాతం కంటే ఎక్కువ మంది కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు. దీనివల్ల అనేక లక్షలమంది తీవ్ర వ్యాధుల బారీన పడుతుండగా, ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు.

ఇది కూడా చదవండి..బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి భారీ పెట్టుబడులు అవసరమని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రపంచంలోని మరణాలకు కాలుష్యం రెండవ ప్రధాన ప్రమాద కారకంగా మారిందని పరిశోధకులు వెల్లడి స్తున్నారు. నేడు, జనాభాలో 99 శాతం కంటే ఎక్కువ మంది కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు, దీనివల్ల ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 7లక్షల మంది పిల్లలు కూడా ఉన్నారు. కలుషితమైన గాలి మహిళలు, పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండవ ప్రధాన ప్రమాద కారకంగా మారింది. వాయు కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల చికిత్స కోసం ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం 8.1ట్రిలియన్ డాలర్లను కోల్పోతున్నాయి.


స్వచ్ఛమైన గాలి కోసం.. 

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన గాలి కోసం పెట్టుబడి పెట్టడంపై దృష్టి సారించారు. స్వచ్ఛమైన గాలిలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు రెండూ శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించాలని ఐక్యరాజ్య సమితి కోరింది. 

గాలి నాణ్యతను బలోపేతం చేయడం, ప్రమాణాలను అమలు చేయడం, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటుచేయడం మీథేన్‌తో సహా హానికరమైన ఉద్గారాలను తగ్గించడం కూడా అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..సంగీతం మానసిక ఆందోళనలను నియంత్రించగలదా..?


ఇది కూడా చదవండి..యోగా ఏ సమయంలో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..రక్తమార్పిడి వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.