Forgetfulness : మతిమరుపు ఎప్పుడు సాధారణం..? ఎప్పుడు ప్రమాదకరం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తాళం చెవులు ఎక్కడో పెట్టి వెతకడం, తెలిసిన వారి పేరు అప్పటికప్పుడు గుర్తుకురాకపోవడం వంటివి మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవాలే. అయితే, అన్ని సందర్భాల్లోనూ మతిమరుపు తీవ్రమైన వ్యాధికి సంకేతం కాదు. అదే సమయంలో,మతిమరుపు రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మతిమరుపునకు దారితీసే సాధారణ కారణాలు..?

వయసు పైబడటం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం సహజమే అయినా, యువతలోనూ ఈ సమస్య తరచూ కనిపిస్తుంటుంది. దీనికి ప్రధానంగా ఈ అంశాలు దోహదం చేస్తాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి: నిరంతర ఆందోళన, డిప్రెషన్ మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి, ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి తగినంత నిద్ర అవసరం. సరైన విశ్రాంతి లేకపోతే కొత్త విషయాలను గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుకు కీలకమైన విటమిన్ B12 లోపిస్తే ఆలోచనా సామర్థ్యం తగ్గడం, గందరగోళం కలగడం వంటివి తలెత్తుతాయి. హార్మోన్ల అసమతు ల్యత.. థైరాయిడ్ సమస్యలు కూడా జ్ఞాపకశక్తి లోపానికి కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

 

మందుల ప్రభావం..

 కొన్ని రకాల నిద్ర మాత్రలు, ఇతర దీర్ఘకాలిక ఔషధాల దుష్ప్రభావాల వల్ల కూడా తాత్కాలికంగా మతిమరుపు రావచ్చు. సాధారణ మతిమరుపు, ఆందోళన కలిగించే సంకేతాలు, తేడాలను గుర్తించండి రోజువారీ జీవితంలో వస్తువులు ఎక్కడో పెట్టి కొద్దిసేపటి తర్వాత గుర్తుతెచ్చుకోవడం సహజమైన మతిమరుపు కిందకే వస్తుంది. అయితే, వస్తువులను అసహజమైన ప్రదేశాల్లో పెట్టి, అసలు తాము అక్కడ పెట్టినట్లు కూడా గుర్తించలేకపోవడం మాత్రం వైద్యపరంగా పరిశీలించాల్సిన తీవ్రమైన సమస్యకు సంకేతం.

సంభాషణల్లో అప్పుడప్పుడు సరైన పదం గుర్తుకురాకపోవడం ఎవరికైనా ఎదురయ్యే సాధారణ విషయమే. కానీ, అడిగిన ప్రశ్నలే పదే పదే అడుగుతూ ఉండటం, మాట్లాడేటప్పుడు తీవ్రంగా తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే, ఎప్పుడో ఒకసారి ఏదైనా పని మర్చిపోవడం పెద్ద విషయం కాదు, నిత్యం తిరిగే బాగా అలవాటైన మార్గాల్లో కూడా దారితప్పడం, రోజువారీ సాధారణ పనులను సైతం పూర్తి చేయలేకపోవడం వంటివి జ్ఞాపకశక్తి లోపం ముదురుతోందనడానికి సూచనలు.

మానసిక ఒత్తిడి..

చిన్నపాటి మానసిక ఒత్తిడి లేదా అలసట వల్ల చిరాకు కలగడం సహజమే అయినా, ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడం, చిన్న విషయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఆందోళన కలిగించే లక్షణాలుగా పరిగణించాలి. వీటన్నింటికీ మించి, జ్ఞాపకశక్తి లోపంతో పాటు హఠాత్తుగా మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తడం, ముఖం ఒకవైపునకు వంగిపోవడం లేదా చేతులు, కాళ్ళలో బలహీనత రావడం వంటివి కనిపిస్తే అది 'స్ట్రోక్' (sign of a stroke) లక్షణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అత్యవసర వైద్య సాయం అందించడం ప్రాణరక్షణకు అత్యంత ముఖ్యం.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.