భారతదేశంలో క్యాన్సర్ మరణాల రేటు ఎవరిలో ఎక్కువ..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో పురుషుల కంటే మహిళల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్యాన్సర్ మరణాల రేటు విషయంలో మాత్రం పురుషులలో ఎక్కువగా కనిపిస్తోంది. స్త్రీలలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా, పురుషులు ఎక్కువగా చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు జీవసంబంధమైన, జీవనశైలి, సామాజిక, వైద్యచికిత్స వంటి అనేక అంశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధుల పట్ల అవగాహన చాలా అవసరం.
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
2022లో భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసులు..
భారతదేశంలో మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూ హెచ్ ఓ డేటా నిర్ధారించింది. డబ్ల్యూహెచ్ఓ, గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 14,13,316 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
కొత్త క్యాన్సర్ కేసులు..
పురుషులు: దాదాపు 6,91,178 కొత్త కేసులు.
మహిళలు: దాదాపు 7,22,138 కొత్త కేసులు.
క్యాన్సర్ మరణాల రేటు..
పురుషులు: దాదాపు 4,70,055 మరణాలు.
మహిళలు: దాదాపు 4,46,772 మరణాలు.
పైన పేర్కొన్న డేటా ప్రకారం భారతదేశంలో పురుషుల కంటే మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. అయితే, ఎక్కువ కేసులు మహిళల్లో వచ్చినా, క్యాన్సర్‌తో మరణిస్తున్న పురుషుల సంఖ్య ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
