కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?   

సాక్షి లైఫ్ : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి దాడి చేశాడు. ఈ సమయంలో, అతనిపై 6 సార్లు కత్తితో దాడి చేయగా, అతని వెన్నెముకకు  తీవ్రంగా గాయాలయ్యాయి. వెన్నుపాము గాయం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది..? దీనివల్ల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా..? 

 

ఇది కూడా చదవండి..మధుమేహానికి, చర్మానికి మధ్య సంబంధం ఏమిటి..?

ఇది కూడా చదవండి..పిల్లల ఆలోచనలు, భావోద్వేగాలు అర్థం చేసుకోవడానికి పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి?

ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నప్పుడు చర్మంపై కనిపించే 5 ముఖ్యమైన లక్షణాలు.. 

 

ఈ దాడి తర్వాత సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరాడు, అక్కడ అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఆరు సార్లు కత్తితో దాడి చేయగా అతని వెన్నెముక దగ్గర పెద్ద గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు చేతికి, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయని వారు తెలిపారు. అలాగే, వెన్నుపాము నుంచి 2.5 అంగుళాల కత్తి ముక్కను తొలగించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి నిలకడగా ఉందని, అతను ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు వైద్యులు.

ప్రాణాంతకం కూడా.. 

వెన్నుపాము దగ్గర కత్తి దాడి అనేది చాలా తీవ్రమైనది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. వెన్నుపాము దగ్గర కత్తిపోటు గాయాల కారణంగా నరాలు, రక్త నాళాలు, కొన్ని అవయవాలతో సహా అనేక ముఖ్యమైన భాగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

వెన్నుపాము శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. మెదడు నుంచి ఇతర అవయవాలకు సందేశాలను ప్రసారం చేయడానికి ఇది ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో వెన్నుపాము దెబ్బతినడం వలన పక్షవాతం, తిమ్మిరి లేదా శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. ఇది వెన్నెముక చుట్టూ ఉన్న కొన్ని ప్రధాన రక్త నాళాలు, నరాలను కూడా దెబ్బతీస్తుంది, దీని కారణంగా నరాలు దెబ్బతినడమేకాకుండా తీవ్రరక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates spine-surgeries spinal-cord-injury spinal-disk-problems spinal-cord-problems symptoms-of-spinal-problems spinal-cord-problems-in-telugu spinal-stenosis spinal-cord-issues bollywood-star bollywood-actor saif-ali-khan knife-attack medical-update spinal-cord spinal-cord-injuries lilavati-hospital mumbai
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com