Moringa Leaves : మునగాకు ఎలాంటి వాళ్లు తినకూడదు..?
సాక్షి లైఫ్ : ప్రకృతి ప్రసాదించిన వరాల్లో మునగ ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే మునగాకును 'మల్టీ విటమిన్' స్టోర్‌హౌస్‌గా పిలుస్తారు. కానీ, నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మునగాకును తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
మునగాకు ఎవరు తినకూడదు..? ఎందుకు..?
గర్భిణీ స్త్రీలు తినకూడదు.. మునగ చెట్టు బెరడు లేదా వేర్లలో ఉండే కొన్ని రసాయనాలు గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. ఇది గర్భస్రావం (Miscarriage) జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే గర్భిణీలు దీనికి దూరంగా ఉండటమే మంచిది.
తక్కువ రక్తపోటు (Low BP) ఉన్నవాళ్లు..
రక్తపోటును తగ్గించే గుణం మునగాకుకు సహజంగానే ఉంటుంది. ఇప్పటికే లో-బీపీ సమస్యతో బాధపడుతున్న వారు దీనిని తీసుకుంటే రక్తపోటు మరింత పడిపోయి నీరసం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు రావచ్చు.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు..
మునగాకు శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ కోసం మందులు వాడేవాళ్లు మునగాకు అతిగా తింటే మందుల పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
చక్కెర స్థాయిని వేగంగా తగ్గిస్తుంది..
మధుమేహ వ్యాధిగ్రస్తులు (Diabetes).. షుగర్ ఉన్నవారు మునగాకు తినడం మంచిదే అయినప్పటికీ, మీరు ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే బలమైన మందులు వాడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. మునగాకు కూడా చక్కెర స్థాయిని వేగంగా తగ్గిస్తుంది కాబట్టి 'హైపోగ్లైసీమియా' అంటే చక్కెర స్థాయిలు మరీ తగ్గిపోవడం వంటి ప్రమాదం ఉంది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మునగాకులో పొటాషియం స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి శరీరంలోని అదనపు పొటాషియంను బయటకు పంపే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలపై అదనపు భారాన్ని పెంచుతుంది. మునగాకును ఔషధంగా లేదా పొడి రూపంలో తీసుకునే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యమని గ్రహించాలి.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.