శీతాకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతాయి..?
సాక్షి లైఫ్ : అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా యువకులలో కూడా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. సాధారణ నడక, బరువు నిర్వహణ, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం వంటి సాధారణ మార్పులు గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.
చలికాలంలో హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గతంలో గుండెపోటు కేసులు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేవి, కానీ ఇప్పుడు యువకులలో సైతం వస్తున్నాయి. చలికాలం అంతటా గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అటువంటివాటిలో జంక్ ఫుడ్ తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ కు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే జీవనశైలి మీ గుండెపోటుకు కారణం అవుతోంది. ఆయా సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి జీవనశైలి అలవాట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్లు చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
