ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : మధుమేహంతో బాధపడుతున్న భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, దాన్ని నివారించడం కష్టమేమీ కాదని అంటున్నారు వైద్యనిపుణులు. జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చని వారు చెబుతున్నారు. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..  

మధుమేహం అనగానే చాలామంది భయాందోళనలకు గురవుతారు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా మధుమేహం మాత్రమే కాకుండా అనేక ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధుల నుంచి కూడా సులువుగా బయట పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం అనేది ఒక రకమైన సైలెంట్ కిల్లర్, ఇది శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తుంది. దీని వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన కిడ్నీలు, కళ్లు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది.

 

ఇది కూడా చదవండి..మధుమేహం అదుపులో ఉండడంలేదా..? ఈటిప్స్ ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి..పిల్లలకు ఇచ్చే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి..?

ఇది కూడా చదవండి..వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు.. 

 

మధుమేహం రాకముందు వచ్చే పరిస్థితిని ప్రీ-డయాబెటిస్ దశ అంటారు. చక్కెర స్థాయిలు నెమ్మదిగా మధుమేహ స్థాయికి చేరుకునే దశ ఇది. రక్తంలో చక్కెరస్థాయిలను పరీక్షించడం ద్వారా ప్రీ-డయాబెటిస్‌ను గుర్తించవచ్చు. భోజనానికి ముందు అంటే ఖాళీ కడుపుతో రక్తంలో చక్కెర స్థాయి 110 ఎంజీ, భోజనం తర్వాత 140 ఎంజీ వరకు ఉంటే, దానిని ప్రీ-డయాబెటిస్ అంటారు. మీరు ఈ దశలో ఉన్నట్లయితే, మీరు భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశం ఉందని అర్థం. మంచి విషయమేమిటంటే, ప్రీ-డయాబెటిస్ స్థాయిని గుర్తించినట్లయితే, మీరు మధుమేహాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : diabetes-affect what-is-prediabetes prediabetes pre-diabetes prediabetes-diet prediabetes-symptoms prediabetes-signs what-is-diabetes symptoms-of-prediabetes reversing-prediabetes prediabetes-range prediabetes-treatment is-prediabetes-dangerous what-is-prediabetes-blood-sugar-levels is-prediabetes-reversible how-is-prediabetes-diagnosed reverse-prediabetes world-diabetes-day-2024 world-diabetes-day world-diabetes-day-2024-theme world-diabetes-day-special-article

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com