సాక్షి లైఫ్ : వేసవి ఎండలు మండిపోతున్నాయి, అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీళ్లు ఎక్కువగా తాగాలి.. కానీ, ప్లాస్టిక్ బాటిల్‌లోని నీళ్లు ఏమాత్రం మంచిది కాదని, ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమయంలో ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి రసాయనాలు నీటిలో కలుస్తాయి, ఇవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
plasti
ఎలాంటి ప్రమాదాలు వస్తాయంటే..?
కెమికల్ లీచింగ్ : ఎండలో లేదా కారులో వేడెక్కిన ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి (బిస్ ఫినాల్ ఏ) బిపిఏ, యాంటిమోనీ వంటి రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇవి హార్మోన్ సమస్యలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
మైక్రోప్లాస్టిక్స్: ఒక లీటరు బాటిల్ నీటిలో 2.4 లక్షల నానోప్లాస్టిక్ కణాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి శరీరంలో చేరి దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయి.
పునర్వినియోగం ప్రమాదం: పాత లేదా ఒకసారి వాడిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను మళ్లీ వాడితే, రసాయనాలు, బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
వేసవిలో జాగ్రత్తలు..
ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఎండలో, కారులో వదిలిపెట్టవద్దు. చల్లని, నీడ ప్రదేశంలో ఉంచండి.
BPA-రహిత లేదా గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్‌కు మారండి.
ఒకసారి వాడిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయండి, మళ్లీ నింపవద్దు.
వేసవిలో శరీరానికి తగిన నీళ్లు అవసరం, కానీ ప్లాస్టిక్ బాటిల్స్ నీరు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. సురక్షితమైన గాజు లేదా మెటల్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.