సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో సరైన బరువు పెరుగుదల తల్లి, బిడ్డ ఇద్దరికీ ముఖ్యం. అధిక బరువు పెరగడం వల్ల గర్భధారణ మధుమేహం, అధిక రక్తపోటు, కాన్పు సమయంలో సమస్యలు వంటివి తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా, తక్కువ బరువు కూడా బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా, గర్భధారణ సమయంలో 10-12 కిలోల బరువు పెరగడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గర్భిణులు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు..
సమతుల్య ఆహారం: మీ రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం వంటివి సమతుల్యంగా ఉండేలా చూసుకోండి.ఫైబర్ పుష్కలంగా: మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు (ఆకుకూరలు, గింజ ధాన్యాలు, పప్పులు) తీసుకోవాలి.
ప్రోటీన్ కీలక పాత్ర: బిడ్డ అవయవాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యం. గుడ్లు, పప్పులు, పెరుగు, చికెన్, చేపలు వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తగినంత ద్రవాలు: రోజుకు కనీసం 8-12 గ్లాసుల నీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవాలను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
కొద్దికొద్దిగా ఎక్కువసార్లు: ఒకేసారి ఎక్కువ తినకుండా, కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు (2-3 గంటలకోసారి) తినడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది.విటమిన్లు, ఖనిజాలు: వైద్యుల సూచన మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ డి, కాల్షియం వంటి సప్లిమెంట్లను తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరలు, సిట్రస్ పండ్లలో ఫోలిక్ యాసిడ్, ఇనుము అధికంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com