అసలు ఈ వ్యాధికి "డింగా డింగా" అనే పేరు ఎందుకు పెట్టారంటే..?  

షేర్ చేయండి:
అసలు ఈ వ్యాధికి "డింగా డింగా" అనే పేరు ఎందుకు పెట్టారంటే..?   

సాక్షి లైఫ్ : గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదొక కొత్తరకం వ్యాధులు ఎక్కడొక చోట వస్తూనే ఉన్నాయి. వ్యాధుల విజృంభణ కొనసాగుతోంది. గతంలో ఆఫ్రికాలో మిస్టీరియస్ డిసీజ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు ఉగాండాలో కూడా అలాంటి మిస్టరీ డిసీజ్ ఒకటి విధ్వంసం సృష్టిస్తోంది. దానికి "డింగా డింగా" అనే పేరు పెట్టారు.. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 
 

ఏదో ఒక వ్యాధి లేదా మరొకటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే విషయం. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉందని యావత్ ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కరోనా కంటే ప్రమాదకరమైన ఏదైనా వ్యాధి కొత్త అంటువ్యాధి ప్రపంచదేశాలను వణికించవచ్చని తెలిపింది. ఇప్పటికే పలుదేశాల్లో ఒక వ్యాధి విజృంభిస్తోంది.

కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

శాస్త్రవేత్తలు దీనికి డిసీజ్ ఎక్స్ అని పేరు పెట్టారు. ఇటీవల, ఆఫ్రికాలోని ఉగాండాలో మరొక మిస్టరీ డిసీజ్ మొదలైంది. అదే "డింగా డింగా" వ్యాధి. ఈ వ్యాధికి ఈ పేరు వచ్చిందంటే..?"డింగా డింగా" అంటే కదిలేటప్పుడు నృత్యం చేయడం అని అర్థం. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్టుగా కదులుతూ ఉంటాడు. బలహీనంగా ఉండడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి, నడవడానికి ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు బలహీనంగా ఉండడం వల్ల  కాళ్లల్లో పటుత్వం లేక అటు ఇటు అడుగులేస్తూ నడుస్తూ ఉండాల్సి వస్తుంది. అది డాన్స్ వేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈ కొత్త వ్యాధికి "డింగా డింగా" అని పేరు పెట్టారు. దీనిని "డ్యాన్సింగ్ డిసీజ్" అని కూడా అంటున్నారు. 

 

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.