నో షేవ్ ప్రచారం కోసం నవంబర్ నెలను ఎందుకు ఎంచుకున్నారు..?
సాక్షి లైఫ్ : నవంబర్‌లో గడ్డం, జుట్టును ఎందుకు తీసుకోరు..? అనే ఈ ప్రచారం ఉద్దేశం ఏమిటి..? 2009లోమాథ్యూ హిల్ ఫౌండేషన్ అనే అమెరికన్ ప్రభుత్వేతర సంస్థ "నో షేవ్ నవంబర్" ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం క్యాన్సర్‌తో పోరాడే బాధితులకు సహాయం అందించడానికి నిధులు సేకరించడం కోసం. ఈ ప్రచారం ద్వారా సేకరించిన డబ్బును క్యాన్సర్ చికిత్స, నివారణ, అవగాహన కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలకు అందిస్తారు. నవంబర్ నెలను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న తలెత్తుతుంది?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఈ ప్రచారం ప్రారంభం హృదయాన్ని హత్తుకునే కథతో ఓ సంఘటన ముడిపడి ఉంది. నవంబర్ 2007లో చికాగోలోని మాథ్యూ హిల్ అనే వ్యక్తి క్యాన్సర్ కారణంగా మరణించాడు. తమ తండ్రిని కోల్పోవడంతో, మాథ్యూ ఎనిమిది మంది పిల్లలు అతని గౌరవార్థం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు సహాయం చేయడానికి ఆయన చనిపోయిన నెల నవంబర్ ను 'నో షేవ్ నవంబర్' ప్రచారాన్ని ప్రారంభించారు.
అందుకే మాథ్యూని ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని, ఆయన ప్రారంభించిన ఈ ఉదాత్తమైన పనిని కొనసాగించాలని నవంబర్ నెలను ఈ ప్రచారానికి ఎంచుకున్నారు. 2009 సంవత్సరంలో ఈ నో షేవ్ నవంబర్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. మాథ్యూ ఎనిమిది మంది పిల్లలు తమతో ఈ ప్రచారం ఆగిపోకూడదని నో షేవ్ డాట్ ఓఆర్జీ పేరుతో ఓ ఛారిటీ ఆర్గనైజేషన్ ను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
