ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ప్రమాదకరం ఎందుకంటే..?
సాక్షి లైఫ్ : ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిల్‌లో సగటున 2లక్షల 40వేల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు నానోప్లాస్టిక్ కణాలపై దృష్టి పెట్టారు. ఇవి మైక్రోప్లాస్టిక్‌ల కంటే కూడా చిన్నగా ఉండే కణాలు. యుఎస్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ బాటిల్స్ లోని సూక్ష్మ కణాల గుర్తించింది. ఇలా గుర్తించడం ఇదే మొదటిసారి. బాటిళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలు మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త అధ్యయనం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
శాస్త్రవేత్తలు గుర్తించారు..
ఈ అధ్యయనం ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ సరికొత్త స్టడీ ప్రకారం.. ప్లాస్టిక్ బాటిల్ నీటిలో గతంలో అనుకున్నదానికంటే 100 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కణాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నానోప్లాస్టిక్ ముక్కలు చాలా చిన్నవి, మైక్రోప్లాస్టిక్‌ల మాదిరిగా కాకుండా, అవి నేరుగా ప్రేగులు, ఊపిరితిత్తుల నుంచి రక్తప్రవాహంలోకి ప్రవేశించగలవు. అక్కడ నుంచి గుండె, మెదడుతో సహా ఇతర అవయవాలకు చేరుతాయి.
మైక్రోప్లాస్టిక్‌ల కంటే..
మైక్రోప్లాస్టిక్‌ల కంటే నానోప్లాస్టిక్‌లు మన ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. ఎందుకంటే..? అవి కణాలు, రక్తంలోకి ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసేంత చిన్నవిగా ఉంటాయి. నానోప్లాస్టిక్‌లు తల్లి బొడ్డు తాడు ద్వారా పుట్టబోయే బిడ్డ శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
