ఆలుగడ్డలు తింటే బరువు పెరుగుతారా..? 

షేర్ చేయండి:
ఆలుగడ్డలు తింటే బరువు పెరుగుతారా..? 

సాక్షి లైఫ్ : బంగాళాదుంపలు (ఆలుగడ్డలు)ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేకరకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారరని పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఆలుగడ్డ తినడం వల్ల బరువు పెరగడానికి కారణమేమిటంటే..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

బంగాళాదుంపలో ఉండే అధిక కేలరీల కంటెంట్ ఊబకాయ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, బంగాళాదుంప తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదనంగా బంగాళ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునేవారు దీనిని తినకపోవడం మేలు. బంగాళదుంపలు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

పిల్లల్లో టాన్సిల్స్‌ కు పరిష్కార మార్గాలు..? 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

  బంగాళాదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదం ఉందట. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చిన, లేదా ఉడకబెట్టిన బంగాళాదుంపలు వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు.

బంగాళాదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుందట. అంతేకాకుండా ఈ దుంపలు తింటే ఉబ్బరం, అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్ లో తేలింది. మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.