ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్.. 

షేర్ చేయండి:
ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్.. 

సాక్షి లైఫ్ : ఆహారం అనేది జీవితానికి ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అందక పోవడంవల్ల నేడు ఎంతోమంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటువంటివారికి అవగాహాన కల్పించేందుకు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 న జరుపుతున్నారు. ఆహారం కేవలం అవసరం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి హక్కు అని ప్రపంచానికి గుర్తు చేయడమే ఈ రోజు ఉద్దేశం.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలికి పౌష్టికాహారం ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..ఏయే ఆహార పదార్థాలు ప్రతి రోజూ తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసా..?

ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం ఎలా ప్రారంభమైంది..?


1945లో ప్రపంచం యుద్ధం తర్వాత రోమ్‌లో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) స్థాపించారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి సరిపడా ఆహారం అందేలా చేయాలనే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 20వ సాధారణ సమావేశంలో ప్రపంచ ఆహార దినోత్సవం అనేది మొదలైంది. ఎఫ్ఏఓ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు అంకితమైన అంతర్జాతీయ సంస్థ. ఎఫ్ఏఓ 1981నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.

ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకునే ఈ రోజు, ఆహారం కడుపు నింపే సాధనం మాత్రమే కాదని, అది ఆరోగ్యకరమైన జీవితానికి , మంచి భవిష్యత్తుకు పునాది అని గుర్తుచేస్తుంది.

ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్.. 

2024 సంవత్సరపు థీమ్: మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరికీ ఆహార హక్కు ఉంది. పౌష్టికాహారం పొందే హక్కు ప్రతి మనిషికి ఉందని నొక్కి చెబుతోంది ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్. దీని కోసం, మనం ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాకుండా ఈ వ్యవస్థ స్థిరంగా ఉండేలా ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఆహార వృధాను అరికట్టడంతోపాటు ఆకలితో, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారందరికీ పౌష్టికాహారం అందించడానికి మార్గాలను అన్వేషించాలి. అనే థీమ్ తో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతున్నారు.  

ఇది కూడా చదవండి..డెంగ్యూ అలెర్ట్ : దోమలను నివారించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..అధిక బరువును అదుపులో ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇవిగో..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.