High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరిగితే కాలి బొటనవేలికే కాదు.. ఈ భాగాలకూ ముప్పే..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే యూరిక్ యాసిడ్ (Uric acid) స్థాయిలు పెరిగిపోతున్నాయి. శరీరంలో ప్యూరిన్ (Purine) అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు ఫిల్టర్ చేయలేనంతగా దీని ఉత్పత్తి పెరిగినప్పుడు రక్తంలో పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే ప్రధాన లక్షణాలు, సమస్యలు..
గౌట్ (Gout) వ్యాధి..యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది చిన్న స్ఫటికాలుగా (Crystals) మారి కీళ్ల వద్ద పేరుకుపోతుంది. దీనివల్ల 'గౌట్' సమస్య వస్తుంది. కీళ్లలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం దీని ప్రధాన లక్షణాలు. కాలి బొటనవేలిలో భరించలేని నొప్పి.. యూరిక్ యాసిడ్ ముప్పుకు ఇది తొలి సంకేతం. ముఖ్యంగా రాత్రిపూట కాలి బొటనవేలిలో అకస్మాత్తుగా భరించలేని నొప్పి మొదలవుతుంది. కాలును తేలికగా తాకినా విపరీతమైన బాధ కలుగుతుంది.
మోకాళ్లు, చీలమండల్లో వాపు.. ఈ స్ఫటికాలు కాలి కీళ్లలో పేరుకుపోవడం వల్ల నడవడానికి, మెట్లు ఎక్కడానికి, కనీసం కాలు మడవడానికి కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. మణికట్టు, చేతి వేళ్లపై ప్రభావం.. కొందరిలో మోచేతులు, మణికట్టు, చేతి వేళ్ల కీళ్లలోనూ నొప్పి, వాపు కనిపిస్తాయి. వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగితే చర్మం కింద గట్టి కణితుల (Tophi) మాదిరిగా ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు (Kidney Stones).. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు మూత్రం ఆమ్లత్వంగా (Low pH) మారుతుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కిడ్నీలలో పేరుకుపోయి రాళ్లుగా మారే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను సులభంగా మూత్రం ద్వారా బయటకు పంపగలవు. ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, తీపి పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
రెడ్ మీట్ (Red meat), సీ ఫుడ్ వంటి ప్యూరిన్ (Purine) అధికంగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. దానికి బదులుగా కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఊబకాయం లేకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. తరచుగా కీళ్ల నొప్పులు, వాపులు బాధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
