సాక్షి లైఫ్ : శరీరంలో అమైనో ఆమ్లాల లోపాన్ని అధిగమించడానికి అనేకరకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ అండ్ వెజ్ విషయంలో చాలా రకాలున్నాయి. శాఖాహార పదార్థాలు, మాంసాహార పదార్థాలు తినడం ద్వారా అమైనో ఆమ్లాలు పొందవచ్చు..అమైనో ఆమ్ల లోపం వల్ల అనేక అనారోగ్యసమస్యలు తలెత్తవచ్చు. పలురకాల ఆహారపదార్థాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
ఇది కూడా చదవండి..వైద్యుని సలహా లేకుండా గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదు..?
ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..ఏమేం విటిమిన్స్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..?
గుడ్లు - ప్రోటీన్ పవర్ హౌస్..
గుడ్లు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని సూపర్‌ఫుడ్స్ అంటారు. ఇవి కండరాలను బలోపేతం చేయడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. రోజూ 1 లేదా 2 ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ వేసుకుని తినండి. పాలు, పాల ఉత్పత్తులు : కాల్షియం, అమైనో ఆమ్లాలు, పాలు, పెరుగు, చీజ్‌లలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
రోజూ ఒక గ్లాసు పాలు తాగండి. మీ ఆహారంలో పెరుగు లేదా పాలు చేర్చుకోండి.సోయాబీన్స్ , టోఫు - శాఖాహార ప్రోటీన్ వనరులు..
మీరు నాన్-వెజ్ తినకపోతే, సోయాబీన్, టోఫు ఉత్తమ ఆహారాలు. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో , కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.
సోయాబీన్, కూరగాయలు లేదా టోఫును సలాడ్‌లో కలిపి తినండి. గింజలు, విత్తనాలు - ఆరోగ్యకరమైన స్నాక్స్..
బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, అవిసె గింజలు, చియా గింజలలో అమైనో ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయం నానబెట్టిన బాదంపప్పు తినండి లేదా స్మూతీలో చియా విత్తనాలను కలిపి తీసుకోండి.
చేపలు- చికెన్ - అధిక ప్రోటీన్ కలిగిన నాన్-వెజ్ ఫుడ్స్..
మీరు మాంసాహారులైతే, చేపలు, చికెన్ అమైనో ఆమ్లాలకు అద్భుతమైన వనరులు. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి.
వారానికి 2-3 సార్లు గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ తినండి.. కాయధాన్యాలు - శనగలు - దేశీయ ప్రోటీన్ కు మూలం..కాయధాన్యాలు, పెసరపప్పు, కంది పప్పు, మినప్పప్పులలో మొక్కల ఆధారిత ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ భోజనం లేదా రాత్రి భోజనంలో ఒక గిన్నెడు పప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు - ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పాలకూర, మెంతులు, బ్రకోలీలలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పాలకూర సూప్ లేదా మెంతి పరోటా తినండి.అరటిపండు, అవకాడో - సహజ శక్తిని పెంచుతాయి..అరటిపండు , అవకాడోలో పొటాషియం, ఫైబర్‌తో పాటు అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అల్పాహారంగా అరటిపండు తినండి లేదా స్మూతీకి అవకాడో తీసుకోండి.శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీ ఆహారంలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com