Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..? 

సాక్షి లైఫ్ : రోజూ ముప్పై నిమిషాలపాటు నడిచినప్పటికీ, వారు వాకింగ్ చేసినందుకు పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు కారణమేమిటంటే వారు నడక సమయంలో చేసే కొన్ని చిన్నచిన్న తప్పులే. అలాంటివాటిని  వారు గుర్తించలేకపోతున్నారట. ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు కూడా అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి.. 

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..? 

ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?

ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?

 

నడక ఉత్తమమైన వ్యాయామం. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు వర్కౌట్ చేయడానికి పరికరాలు కూడా అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం చాలా ముఖ్యం. నడకలో తరచుగా ప్రజలు కొన్ని పొరపాట్లు చేస్తారని, వాటిని సరిదిద్దుకుంటే నడక చాలా ప్రయోజనకరంగా మారుతుందని డాక్టర్స్ అంటున్నారు. నడిచేటప్పుడు సాధారణంగా జరిగే తప్పులు ఏమిటో తెలుసుకుందాం.. 

సరైన భంగిమ.. 

నడక సమయంలో మీ భంగిమ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. మీ నడుము నిటారుగా ఉండాలి. వంగకుండా, నిటారుగా నడవాలి, కానీ కొందరు నడిచేటప్పుడు తరచుగా ఈ పొరపాటు చేస్తారు. వారు చాలా నెమ్మదిగా నడుస్తారు లేదా చాలా వేగంగా నడుస్తారు. నడుస్తున్నప్పుడు వంగడం లేదా కిందికి చూడటం వల్ల మెడ , వీపుపై ఒత్తిడి పడుతుంది. వేగంగా నడవడం వల్ల తరచూ భంగిమ మార్చడం వల్ల కండరాలు సాగి నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయడం మానుకోండి.

ఇలాంటి పొరపాటు.. 

ఇలాంటి పొరపాటు కొందరు తరచుగా చేస్తుంటారు. వారు మొబైల్ ఫోన్‌తో మాట్లాడుతూ నడుస్తారు లేదా చెవుల్లో ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లు పెట్టుకొని పాటలు వినడం లేదంటే ఫోన్లలో మాట్లాడడం చేస్తుంటారు. మరికొందరు తమ స్నేహితులతో కలిసి వాకింగ్‌కి వెళ్లి, మాట్లాడుకుంటూ ఉంటారు. 

కానీ అలా చేయడం ఆరోగ్యకరం కాదు. దీని వల్ల నడకపై ఏకాగ్రత ఉండదు. పైగా మనం ప్రకృతితో మమేకం కాలేక అనేక అంశాలకు దూరమవుతున్నాం. మనం పూర్తి ఏకాగ్రతతో నడుస్తున్నప్పుడు, ఫలితాలు మరింతగా కనిపిస్తాయని వైద్యలు చెబుతున్నారు.  

కేవలం నడవడం మాత్రమేకాదు.. 

కేవలం నడవడం మాత్రమేకాదు నడుస్తున్నప్పుడు, చేతులు కూడా పూర్తిగా తెరిచి, కాళ్ళతో పాటు కదపాలి. ఇలా చేయడంవల్ల శరీరంలోని అవయవాలు కదులుతాయి. తద్వారా శరీరమంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

 వాకింగ్ సమయంలో..  

నడిచేటప్పుడు కొందరు తరచుగా చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వారు చెప్పులు ధరించి నడవడం లేదా వదులుగా ఉండే పాదరక్షలు ధరించడం కారణంగా వాకింగ్ సమయంలో నడకలో ఇబ్బంది పడటమే కాకుండా, వారు సరైన విధానంలో నడవలేరు. అంతేకాకుండా ఇలా చేస్తే తక్కువ సమయంలోనే అలసిపోతారు. కాళ్ల నొప్పులు కూడా వస్తాయి. అందువల్ల వాకింగ్ కు వెళ్లినప్పుడు సరైన పాదరక్షలను ధరించాలి.

సరిపడా నీరు.. 

నడుస్తున్నప్పుడు ఎల్లప్పుడూ సరిపడా నీరు తాగడం ముఖ్యం. లేదంటే  బాగా డీహైడ్రేట్ అవ్వడమేకాకుండా అలసట, కండరాల తిమ్మిరిగా కూడా అనిపించవచ్చు. అందుకోసమే అలంటి ఇబ్బంది కలగకుండా  నడిచేటప్పుడు తగినంత నీరు తాగాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes walking exercise blood walk improve-blood-circulation-in-legs bad-habits 5-bad-habits,habits smart-phone walking-vs-running walking-vs-running-benefits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com