Medical Tests : కాలేయ ఆరోగ్యాన్ని పసిగట్టే వైద్య పరీక్షలు ఇవిగో..

షేర్ చేయండి:
Medical Tests : కాలేయ ఆరోగ్యాన్ని పసిగట్టే వైద్య పరీక్షలు ఇవిగో..

సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, బీపీ నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ వరకు అనేక సమస్యలు అన్ని వయసుల వారినీ చుట్టుముడుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 

ముఖ్యంగా మద్యం, ఊబకాయం, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే 'కాలేయం' (Liver) తీవ్రంగా దెబ్బతింటోంది. ముందుగానే ఈ సమస్యలను గుర్తించకపోతే కాలేయ మార్పిడి లాంటి లక్షల రూపాయల ఖర్చయ్యే, ప్రాణాపాయమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే, కేవలం 500 నుంచి 1000 రూపాయల ఖర్చుతో చేసే కొన్ని సులభమైన వైద్య పరీక్షల ద్వారా ఈ ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కాలేయ ఆరోగ్యాన్ని పసిగట్టే ఆ పరీక్షలివే..

లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT)..దీని ఖర్చు దాదాపు రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటుంది. ఇది ఒక సాధారణ రక్త పరీక్ష. దీని ద్వారా కాలేయం ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు, ప్రొటీన్లు, బిలిరుబిన్, అల్బుమిన్ స్థాయిలను కొలుస్తారు. ALT, AST ఎంజైమ్‌ల స్థాయిలు పెరిగితే కాలేయ కణాలు దెబ్బతిన్నట్లు లెక్క. బిలిరుబిన్ పెరిగితే కామెర్లు లేదా ఇతర కాలేయ సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

అల్ట్రాసౌండ్ స్కాన్.. దీని ఖర్చు రూ. 450 నుంచి రూ. 1000 మధ్య ఉంటుంది. రక్త పరీక్షల్లో బయటపడని కాలేయ నిర్మాణంలో మార్పులను ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఫ్యాటీ లివర్, కాలేయ వాపు, కణితులు, సిర్రోసిస్ వంటి సమస్యలను గుర్తించడానికి వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..

హెపటైటిస్ పరీక్ష..ఈ పరీక్షకు రూ.150 నుంచి రూ.700 వరకు ఖర్చవుతుంది. హెపటైటిస్ వైరస్‌లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, హెపటైటిస్ బి, సి వంటి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. రక్త మార్పిడి జరిగినవారు, సురక్షితం కాని ఇంజెక్షన్లు తీసుకున్నవారు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని ముందుగా గుర్తిస్తే మందులతో అదుపు చేసి, క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు.

మరికొన్ని అధునాతన పరీక్షలు.. 

ఇలాంటి పరీక్షలతో పాటు పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు మరికొన్ని అధునాతన పరీక్షలను సూచిస్తారు. ఫైబ్రోస్కాన్.. కాలేయం ఎంత గట్టిగా మారిందో, సిర్రోసిస్ ప్రమాదం ఎంతుందో ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. లివర్ బయాప్సీ..ఇతర పరీక్షల్లో స్పష్టత రానప్పుడు, కాలేయ కణజాలాన్ని తీసి మైక్రోస్కోప్ కింద పరీక్షించి క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు.

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.