Melanoma Risk : భారత్‌లో పెరుగుతున్న మెలనోమా ముప్పు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అరికాళ్లు, గోళ్ల కింద మచ్చలను నిర్లక్ష్యం చేయొద్దు: నిపుణుల హెచ్చరికచర్మ క్యాన్సర్‌కు సంబంధించిన అత్యంత ప్రమాదకర రూపమైన ‘మెలనోమా’ బారిన భారత్‌లో ఏటా వేల సంఖ్యలో ప్రజలు పడుతున్నారు. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇక్కడ ఈ వ్యాధి తీవ్రత సంఖ్యాపరంగా తక్కువగా కనిపించిన ప్పటికీ, భారతీయుల్లో ఇది బయటపడే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటోంది. ఫలితంగా చాలామంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.  

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

 

పాశ్చాత్య దేశాలతోపాటు..

సాధారణంగా ఎండ తగిలే శరీర భాగాలపై పుట్టుమచ్చల్లో మార్పులు రావడం చర్మ క్యాన్సర్ ప్రాథమిక లక్షణంగా భావిస్తారు. అయితే, నల్లని లేదా గోధుమ రంగు చర్మం కలిగిన భారతీయుల్లో ఇది ఎక్కువగా అరికాళ్లు, చేతి లేదా కాలి గోళ్ల కింద కనిపిస్తుంది.  

 ఏక్రల్ లెంటిజినస్ మెలనోమా..

నల్లటి చర్మతత్వం ఉన్నవారిలో వచ్చే మెలనోమా కేసుల్లో 35 నుంచి 60 శాతం వరకు ఈ రకానికి చెందినవే ఉంటున్నాయి. అరికాళ్లపై వచ్చే ఈ మచ్చలను చాలామంది రక్తకట్టు, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా డయాబెటిక్ పుండ్లుగా పొరబడుతుంటారు. బయాప్సీ చేసే సమయానికే క్యాన్సర్ ముదిరిపోతోంది.   

మ్యూకోసల్ మెలనోమా..

అంతర్గత శ్లేష్మ పొరల్లో (mucous membranes) వచ్చే ఈ క్యాన్సర్ అత్యంత తీవ్రమైనది. ఇది చాలా తక్కువ ముందస్తు సంకేతాలను చూపుతుంది, వ్యాప్తి చెందిన తర్వాతే నిర్ధారణ అవుతుంటుంది.   శరీరంలో ఎక్కడైనా ఒక నల్లటి లేదా వర్ణద్రవ్యపు మచ్చ నిరంతరం మారినా, తగ్గకుండా అలాగే ఉన్నా ఏమాత్రం తేలికగా తీసుకోకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.   

అందుబాటులోకి ఆధునిక చికిత్సలు..

గతంతో పోలిస్తే మెలనోమా చికిత్సారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే ఇమ్యు నోథెరపీ (immune checkpoint blockade) విధానాలు రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (NGS) వంటి సాంకేతికతల ద్వారా కణితి జన్యు క్రమాన్ని విశ్లేషించి, నిర్దిష్ట ఉత్పరివర్తనాలకు (ఉదాహరణకు BRAF మ్యుటేషన్) అనుగుణంగా లక్ష్యిత ఔషధాలను అందించే ప్రిసిషన్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది.   

కణితి కణాలను ఎదుర్కొనే 'టిల్ (TIL) థెరపీ'తో పాటు, రోగి సొంత కణితి ఆధారంగా రూపొందించిన వ్యక్తిగత ఎంఆర్ఎన్ఏ (mRNA) క్యాన్సర్ టీకాలు శస్త్రచికిత్స అనంతరం వ్యాధి తిరగబెట్టే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.   అధునాతన చికిత్సలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, వ్యాధి తొలి దశలోనే గుర్తించినప్పుడే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో చర్మ క్యాన్సర్‌పై ఉన్న సంప్రదాయ ప్రచార విధానాలు మారి, అరికాళ్లు, గోళ్లపై వచ్చే మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.