సాక్షి లైఫ్ : మన శరీరంలో మౌనంగా పనిచేస్తూ, విషతుల్యాలను బయటకు పంపే అతిపెద్ద కర్మాగారం 'కాలేయం'. కాలేయం దెబ్బతింటే ప్రాణాలకే ముప్పు. అయితే, కాలేయ ఆరోగ్యం పట్ల సమాజంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 19న 'ప్రపంచ కాలేయ దినోత్సవం' సందర్భంగా... "దృఢమైన అలవాట్లు, బలమైన కాలేయం" (Stold Habits, Strong Liver) అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
కాలేయం విషయంలో తరచుగా వినిపించే కొన్ని అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఇవే..
అపోహ 1 : కాలేయ శుద్ధికి (Detox) ప్రత్యేక ఆహారాలు అవసరం.
వాస్తవం: కాలేయాన్ని శుద్ధి చేయడానికి ప్రత్యేకమైన పానీయాలు లేదా డిటాక్స్ డైట్లు అవసరం లేదు. రక్తాన్ని శుద్ధి చేయడం, పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా కాలేయం తన పని తాను సొంతంగా చేసుకుంటుంది. దీనికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
అపోహ 2 : మద్యం తాగే వారికే కాలేయ వ్యాధులు వస్తాయి..
వాస్తవం: మద్యం ప్రధాన కారణమే అయినప్పటికీ, అది ఒక్కటే కారణం కాదు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, ఊబకాయం, నిశ్చల జీవనశైలి వల్ల వచ్చే 'ఫ్యాటీ లివర్', హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
అపోహ 3 : కాలేయం దెబ్బతింటే వెంటనే లక్షణాలు తెలుస్తాయి.
వాస్తవం : ఇది చాలా ప్రమాదకరమైన అపోహ. కాలేయం గణనీయంగా దెబ్బతినే వరకు చాలా సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు బయటపడవు. అలసట, కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు), కడుపు వాపు వంటివి కనిపిస్తున్నాయంటే సమస్య తీవ్రమైందని అర్థం.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి..
అకారణంగా వచ్చే తీవ్రమైన అలసట.
కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు.
కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారడం.
కాళ్లలో లేదా కడుపులో అసాధారణ వాపు.
సప్లిమెంట్లపై మోజు వద్దు..!
కాలేయ వ్యాధిని నయం చేసే అద్భుత మాత్రలు లేదా సప్లిమెంట్లు మార్కెట్లో లేవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా, సొంత వైద్యంతో వాడే కొన్ని రకాల సప్లిమెంట్లు కాలేయంపై మరింత భారాన్ని పెంచుతాయి. ఏదైనా మందు వాడే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. మితాహారం, నిత్య వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండడం.. ఈ మూడే మీ కాలేయానికి రక్షణ కవచాలు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) చేయించు కోవడం ద్వారా ముప్పును ముందే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన కాలేయమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది..!
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com