సాక్షి లైఫ్ : ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ అధికారులు వడగాలుల హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుచుకోవడం ఎంతో ముఖ్యం. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు, జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఒక అద్భుతమైన భారతీయ పానీయాన్ని పరిచయం చేసింది. అదే 'బార్లీ రాబ్డీ'. రాజస్థాన్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయ పానీయం మధుమేహులకు, బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఎంతో మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
కావలసిన పదార్థాలు..?
బార్లీ గింజలు - 1/2 కప్పు
పెరుగు - 1/2 కప్పు
శనగపిండి - 2 టీస్పూన్లు
గోధుమ పిండి - 2 టీస్పూన్లు
మజ్జిగ - 2 గ్లాసులు
నీరు - 1.5 లీటర్లు
ఉప్పు - రుచికి సరిపడా
పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, తగినంత కలపాలి.
తయారీ విధానం ఇలా..
ముందుగా ఒక గిన్నెలో పెరుగు, నీరు పోసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. అందులో శనగపిండి, గోధుమపిండి వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి. బార్లీ గింజలను శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్ లేదా బాణలిలో మూడు వంతుల నీరు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
బార్లీ ఉడికిన తర్వాత మంట తగ్గించి, ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు-పిండి మిశ్రమాన్ని అందులో పోయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఉడికిన ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల రాబ్డీ పులిసి, శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమంలో మజ్జిగ కలిపి బాగా గిలకొట్టాలి. చివరగా తరిగిన పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి చల్లుకుని చల్లగా ఆస్వాదించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు అనేకం..
ఈ పానీయం శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది, ఎండ ప్రభావం పడకుండా కాపాడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలైన ఆహారం.
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. కృత్రిమ శీతల పానీయాల కంటే ఇలాంటి సంప్రదాయ పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వేసవిలో వచ్చే నీరసం నుంచి తక్షణ శక్తి లభిస్తుంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com