Best Foods for Teenagers : టీనేజర్ల ఎదుగుదలకు ఈ 6 ఆహారాలే కీలకం..!

సాక్షి లైఫ్ : కౌమారదశ అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ వయస్సులో శరీరం వేగంగా పెరుగుతుంది, ఎముకలు ధృడపడతాయి, కండరాలు రూపుదిద్దుకుంటాయి. ఈ శారీరక మార్పులకు సరిపడా ఇంధనం కావాలంటే 'ప్రోటీన్' తప్పనిసరి. ప్రోటీన్ లోపం ఏర్పడితే ఎదుగుదల మందగించడమే కాకుండా, త్వరగా అలసట వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఆరు రకాల ఆహారాలను టీనేజర్ల రోజువారీ మెనూలో చేర్చాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

1. మాంసం, చేపలు..

మాంసాహారం తీసుకునే వారికి చికెన్, చేపలు, ఇతర మాంసాలు అత్యుత్తమ ఎంపికలు. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు కండరాల మరమ్మత్తుకు, నిర్మాణానికి తోడ్పడతాయి. 100 గ్రాముల చికెన్‌లో సుమారు 27 గ్రాములు, చేపల్లో 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి రోజంతా చురుగ్గా ఉండటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.

2. వెజిటేరియన్ల 'మీట్'.. సోయా చంక్స్.. 

శాకాహారులకు సోయా చంక్స్ ఒక వరమనే చెప్పాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ అందించే వనరు ఇది. శరీర పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటిని కూరలు లేదా పులావ్‌లలో చేర్చుకోవడం ద్వారా టీనేజర్లకు కావాల్సిన శక్తిని అందించవచ్చు.

3. పప్పుధాన్యాలు, బఠానీలు..

మొక్కల ఆధారిత ప్రోటీన్ కావాలనుకునే వారికి పప్పులు, పచ్చి బఠానీలు అద్భుతమైన మార్గాలు. 100 గ్రాముల పప్పుల ద్వారా 9 గ్రాముల ప్రోటీన్‌తో పాటు, జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్, ఇతర విటమిన్లు కూడా అందుతాయి.

4. పనీర్.. ఎముకల పుష్టికి.. 

పాల ఉత్పత్తుల్లో పనీర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ప్రోటీన్‌తో పాటు కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది టీనేజర్లలో ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. 100 గ్రాముల మొజారెల్లా చీజ్‌లో దాదాపు 28 గ్రాముల ప్రోటీన్ ఉండటం విశేషం.

5. గుడ్లు - పెరుగు.. రోజూ తింటే మేలు..

గుడ్డును సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. గుడ్లు, పెరుగు తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు విటమిన్-డి, కాల్షియం లభిస్తాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

6. గుప్పెడు డ్రై ఫ్రూట్స్.. ఆరోగ్యం మెండు.. 

బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులకు, విటమిన్లకు నిలయాలు. 100 గ్రాముల బాదంలో 21 గ్రాములు, పిస్తాలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. స్నాక్స్ రూపంలో వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కండరాలు దృఢంగా తయారవుతాయి. సమతుల్య ఆహారంతో పాటు తగినంత శారీరక శ్రమ, వ్యాయామం తోడైతేనే ఈ పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : teenagers essential-nutrients essential-minerals child-growth health-essentials essential-vitamins
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com