Soybean vs Egg : ప్రోటీన్ విషయంలో.. సోయాబీన్ మేలా..? గుడ్డు మేలా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీర దారుఢ్యానికి, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ (protein) ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఉత్తమమైన ప్రోటీన్ కోసం శాఖాహారులు ‘సోయాబీన్’ వైపు, మాంసాహారులు ‘గుడ్డు’ వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ రెండింటిలో శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది..? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..Mobile Phone : మొబైల్ ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రించడం ప్రమాదకరమా..? ఎందుకు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

ప్లాంట్ బేస్డ్ ఫుడ్.. సోయాబీన్..  

శాఖాహారంలో అత్యుత్తమమైన ప్రోటీన్ వనరుగా సోయాబీన్‌ను పేర్కొనవచ్చు. జంతు సంబంధిత ఆహారాలతో సమానంగా ఇందులో పోషకాలు లభిస్తాయి.

అమైనో ఆమ్లాలు.. శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సోయాబీన్‌లో పుష్కలంగా ఉన్నాయి.

గుండె ఆరోగ్యం..రోజుకు సుమారు 25 గ్రాముల సోయా ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మహిళల ఆరోగ్యం..సోయాబీన్‌లో ఉండే ‘ఐసోఫ్లేవోన్లు’ మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు, వయసు పెరిగేకొద్దీ వచ్చే ఎముకల క్షీణత (ఆస్టియోపోరోసిస్) సమస్యను నివారిస్తాయి.

మధుమేహం, క్యాన్సర్ నియంత్రణ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలైన ఆహారం. అంతేకాదు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలోనూ సోయాబీన్ దోహదపడుతుంది.

పోషకాల గని..గుడ్డు..

ప్రోటీన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది గుడ్డు. దీనిలో ఉండే అధిక జీవ నాణ్యత (High Biological Value) కలిగిన ప్రోటీన్ శరీరానికి త్వరగా అందుతుంది. సులభంగా జీర్ణం.. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా జీర్ణమవడమే కాకుండా, కండరాల నిర్మాణానికి (Protein Synthesis) అద్భుతంగా తోడ్పడుతుంది.బరువు నియంత్రణ.. బరువు తగ్గాలనుకునే వారికి, కండరాల పుష్టిని ఆశించే వ్యాయామ ప్రియులకు గుడ్డు ఒక సంపూర్ణమైన,అత్యంత ప్రభావవంతమైన ఆహారంగా నిలుస్తోంది.

ఇంతకీ ఏది బెస్ట్ అంటే..?

సోయాబీన్, గుడ్డు రెండూ వాటి స్థానాల్లో అద్భుతమైనవే. ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా వ్యక్తిగత ఆరోగ్యం, అవసరాలపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, ఎముకల బలాన్ని పెంచుకోవాలి అనుకునే వారికి, అలాగే శాఖాహారులకు సోయాబీన్ చక్కటి ఎంపిక. అదే సమయంలో, కండరాల నిర్మాణం, వేగంగా బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్న వారికి గుడ్డు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం సమతుల్య ఆహారంలో భాగంగా ఈ రెండింటినీ తగిన మోతాదులో చేర్చుకోవడం ఉత్తమ మార్గమని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.