Sunstroke : సన్ స్ట్రోక్ పట్ల.. అప్రమత్తంగా ఉండాల్సిందే..! 'వడదెబ్బ' తగలకుండా ఇలా చేయండి..

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఈ తీవ్రమైన ఎండలు ప్రాణాంతకమైన 'వడదెబ్బ'కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని అంతర్గత సమతుల్యత దెబ్బ తింటుంది. చెమట రూపంలో నీరు, లవణాలు వేగంగా బయటకు వెళ్లిపోవడం వల్ల అవయవాల పనితీరుపై ఒత్తిడి పెరుగుతుంది.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

శరీరంపై ఎండ ప్రభావం..  

తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని అంతర్గత సమతుల్యత దెబ్బ తింటుంది. చెమట రూపంలో నీరు, లవణాలు వేగంగా బయటకు వెళ్లిపోవడం వల్ల అవయవాల పనితీరుపై ఒత్తిడి పెరుగుతుంది. డీహైడ్రేషన్..ఇది వడదెబ్బకు మొదటి సంకేతం. విపరీతమైన అలసట, తల తిరగడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే రక్తపోటు పడిపోయి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు.. వేడి వల్ల ఆకలి మందగించడం, ఎసిడిటీ వంటివి తలెత్తుతాయి. అలాగే ఆహారం త్వరగా పాడైపోవడం వల్ల డయేరియా, వాంతులు వంటి ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది.

వడదెబ్బ (Heat Stroke) లక్షణాలు.. ఎలా ఉంటాయంటే..? 

ఎక్కువ సేపు ఎండలో గడిపినప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకునే శక్తిని కోల్పోతుంది. వికారం, కండరాల నొప్పులు. గుండె వేగంగా కొట్టుకోవడం, గందరగోళానికి గురవ్వడం. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరగడం. ఇది మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే చికిత్స అందించాలి.

ఎలాంటి వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి..!

ఎండల ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు  తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు వీరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. గుండె, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎండ వల్ల ముప్పు ఎక్కువ. బయట పనిచేసేవాళ్లు.. గంటల తరబడి ఎండలో శ్రమించే కార్మికులు వడఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. గర్భిణులు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఆరోగ్య సూత్రాలు.. మీ కోసం..!

నీరు అధికంగా తాగాలి..దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే గొడుగు, టోపీ ధరించాలి. ఇంట్లో వండిన తాజా ఆహారం, పండ్లు తీసుకోవాలి. అధిక మసాలాలు, వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎండలను సాధారణ వాతావరణ మార్పుగా కాకుండా, ఆరోగ్య సవాలుగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : summer-health-tips summer-season summer summer-health summer-alert summer-heat sunstroke sunstroke-protection
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com