సాక్షి లైఫ్ : సూర్యుడు నిప్పులుకక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంటుంది. కేవలం దాహం వేసినప్పుడే నీరు తాగడం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా, రక్తం శుద్ధి కావాలన్నా వయసును బట్టి తగినంత నీరు తీసుకోవడం అత్యవసరం. మరి ఏ వయసు ప్రకారం రోజుకు ఎవరెన్ని లీటర్ల నీరు తాగాలో మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..
1. చిన్నారులు జాగ్రత్త..
5 నుంచి 12 ఏళ్ల వయసులో పిల్లలు ఆటపాటలతో చాలా చురుగ్గా ఉంటారు. దీనివల్ల వారి శరీరంలో త్వరగా నిర్జలీకరణ (Dehydration) కలిగే అవకాశం ఉంది.నీటి మోతాదు ఎంత తీసుకోవాలంటే..? రోజుకు 1 నుంచి 1.5 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు ఇవ్వడంమరింత మంచిది.
2. కౌమార దశలో..
13 నుంచి 18 ఏళ్లు శరీరంలో ఎదుగుదల వేగంగా ఉండే సమయం ఇది. పాఠశాల ఒత్తిడి, క్రీడల వల్ల వీరికి శక్తితో పాటు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నీటి మోతాదు ఎంత అవసరం అంటే..? ప్రతిరోజూ 1.5 నుంచి 2.5 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. ప్రయోజనం ఏంటంటే..? ఇది ఏకాగ్రతను పెంచుతుంది, తరచుగా వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.
3.18 నుంచి 50 ఏళ్లు..
18 నుంచి 50 ఏళ్లు ఉద్యోగస్తులు, శారీరక శ్రమ చేసే వారు ఈ వర్గంలో ఉంటారు. ఎండలో తిరిగే వారు తమ శరీర అవసరాలను బట్టి నీటిని తాగాలి. నీటి మోతాదు.. రోజుకు 2.5 నుంచి 3.5 లీటర్ల నీరు అవసరం. ప్రయోజనం ఏంటంటే..? తగినంత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
4. వృద్ధాప్యంలో..
50 ఏళ్లు పైబడిన వారు..వయసు పెరిగే కొద్దీ సహజంగానే దాహం వేసే లక్షణం తగ్గుతుంది. కానీ శరీరం లోపల నీటి అవసరం మాత్రం తగ్గదు. నీటి మోతాదు ఎంత అవసరం అంటే..? దాహం వేయకపోయినా రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. నీటి శాతం తగ్గితే కిడ్నీ సమస్యలు, తక్కువ రక్తపోటు (Low BP) వచ్చే ప్రమాదం ఉంది. తాగే పద్ధతి కూడా ముఖ్యమే.. నీటిని ఒకేసారి కాకుండా గంటకో గ్లాసు చొప్పున సిప్ చేస్తూ తాగాలి.
డీహైడ్రేషన్ సంకేతాలు ఎలా గుర్తించాలి. మూత్రం ముదురు పసుపు రంగులో వస్తున్నా, నోరు ఎండిపోతున్నా మీ శరీరం డీహైడ్రేషన్ అయినట్లు అర్థం చేసుకోవాలి. వేసవిలో పుచ్చకాయ, కీర దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోండి. 'జలమే జీవధార' అంటారు.. దాహం వేసే వరకు వేచి చూడకండి.. మీ వయసుకు తగ్గట్టుగా నీరు తాగి వేసవి తాపం నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..??
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com