Diarrhea in Summer : వేసవిలో 'విరేచనాలు'.. నిర్లక్ష్యం చేస్తే ముప్పే..! వైద్యనిపుణులేమంటున్నారంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మండుతున్న ఎండలు, పెరిగిన తేమ కేవలం చర్మానికే కాదు.. మన ఉదరానికి కూడా ఇబ్బంది కలిగిస్తాయి. వేసవిలో ఎసిడిటీ, గ్యాస్, ఫుడ్ పాయిజనింగ్, ముఖ్యంగా విరేచనాలు (diarrhea) వంటి సమస్యలు వేగంగా ప్రబలుతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు మన జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం..  

వేడి, తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. వేసవికాలంలో వండిన ఆహారం త్వరగా పాడవుతుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన విక్రయించే కోసిన పండ్లు, నిల్వ ఉంచిన పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువ.

 అధిక చెమట వల్ల శరీరం నుంచి ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు బయటకు పోతాయి. నీటి కొరత వల్ల కడుపులో ఆమ్లాల స్థాయి మారి, అజీర్ణం, నొప్పి వంటివి తలెత్తుతాయి.

లక్షణాలను గుర్తించండిలా..

మొదట్లో సాధారణంగానే అనిపించినా, ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.  కడుపులో తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి, ఆగకుండా వచ్చే వాంతులు, విరేచనాలు,విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరంగా ఉండటం. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ఇవి తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది.

ఉపశమనం కోసం ఏం చేయాలి..?

 శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. మంచి నీటితో పాటు కొబ్బరి నీళ్లు, పలచని మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం తీసుకోవడం ఉత్తమం.  సమస్య తగ్గకపోతే సొంత వైద్యం చేసుకోకుండా తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి మందులు వాడాల్సి ఉంటుంది.

నివారణకు.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

 భోజనానికి ముందు, బయట నుంచి వచ్చినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వాడాలి. అతిగా వేయించిన మసాలా పదార్థాలు, కెఫీన్, ఆల్కహాల్, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. బయట దొరికే నిల్వ ఉంచిన జ్యూస్‌లు, ఐస్ ముక్కలు వేసిన పానీయాల విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వేసవిలోనూ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.