సాక్షి లైఫ్ : శరీరానికి ఆధారం ఎముకలే. అవి దృఢంగా ఉంటేనే వయసు పెరిగినా మనం ఉత్సాహంగా ఉండగలం. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు గుర్తొచ్చేది కాల్షియం. కానీ, కేవలం కాల్షియం సప్లిమెంట్లు మింగేస్తే సరిపోతుందా..? అంటే కాదంటున్నారు వైద్యనిపుణులు. ఎముకల సాంద్రత పెరగాలన్నా, అవి దృఢంగా మారాలన్నా కాల్షియంతో పాటు మరికొన్ని అంశాలు తోడవ్వాలని వారు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
1. విటమిన్-డి..
మనం తీసుకునే ఆహారంలోని కాల్షియం రక్తంలోకి, అక్కడి నుంచి ఎముకల్లోకి చేరాలంటే విటమిన్-డి3 తప్పనిసరి. ఇది లేకపోతే శరీరానికి అందాల్సిన కాల్షియం వృథాగా పోతుంది. ప్రతిరోజూ ఉదయం కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు లేత ఎండ తగిలేలా చూసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడాలి.
2. మెగ్నీషియం, విటమిన్-కె2..
కాల్షియం నేరుగా ఎముకలకు అంటుకోవడానికి మెగ్నీషియం సహాయపడితే, ఆ కాల్షియం ధమనుల్లో (Arteries) పేరుకుపోకుండా నేరుగా ఎముకలకే చేరేలా విటమిన్-కె2 బాధ్యత వహిస్తుంది. అందుకోసం ఆకుకూరలు, బాదం, గుమ్మడి గింజలు, కివీ పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి.
3. వ్యాయామం..
ఎముకలపై కొంత ఒత్తిడి పడినప్పుడే అవి బలోపేతం అవుతాయి. దీనిని 'వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజ్' అంటారు. వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, చిన్నపాటి బరువులు ఎత్తడం వంటివి వారానికి కనీసం 4 సార్లు చేస్తే ఎముక సాంద్రత (Bone Density) పెరుగుతుంది.
4. ప్రోటీన్..
ఎముకల నిర్మాణంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తగ్గితే ఎముకలు పెళుసుగా మారుతాయి. పప్పుధాన్యాలు, పన్నీర్, సోయా, గుడ్లు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి.
వీటిని దూరం పెట్టండి.. !
ఆహారంలో ఉప్పు అధికమైతే అది మూత్రం ద్వారా శరీరంలోని కాల్షియంను బయటకు పంపిస్తుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలు, సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది.
ఆకుకూరల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. కృత్రిమ రంగులు వేసిన కూరగాయలను నివారించి, వంటకు ముందు ఉప్పు నీటిలో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. సరైన జీవనశైలితోనే 'బోన్ హెల్త్' మీ సొంతం చేసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com