Vitamin D Deficiency :విటమిన్ 'డి' లోపమా..? రోజూ 10 నిమిషాల ఎండ సరిపోతుందా..?
సాక్షి లైఫ్ : విటమిన్ డి మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. ఎముకల దృఢత్వానికి, కండరాల పనితీరుకు, రోగనిరోధక శక్తి (immunity) మెరుగుపడటానికి ఇది ఎంతో అవసరం. అయితే ప్రస్తుత జీవనశైలి, గంటల తరబడి ఏసీ గదుల్లోనే గడపడం, ఎండ తగలకుండా ఉండటం వల్ల చాలామంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారు. అయితే, ఈ లోపాన్ని అధిగమించడానికి రోజూ 10 నిమిషాలు ఎండలో నిలుచుంటే సరిపోతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
10 నిమిషాల ఎండ సరిపోతుందా..?
కొంతమందికి రోజూ 10 నుంచి 15 నిమిషాల ఎండ సరిపోవచ్చు. కానీ ఇది అందరికీ వర్తించదు. వయసు, చర్మం రంగు, వాతావరణం, ఎండ తీవ్రత, మన చర్మం ఎంతమేర ఎండకు తగులుతోంది అనే అంశాలపై విటమిన్ డి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు ముదురుగా ఉన్నవారికి, శరీరమంతా దుస్తులతో కప్పుకునే వారికి విటమిన్ డి ఉత్పత్తి కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కేవలం సమయం మాత్రమే కాదు, ఎండ నాణ్యత కూడా ముఖ్యమే.
ఏ సమయం అనుకూలం..?
ఉదయం పూట ఎండ కాస్త పెరిగినప్పటి నుంచి మధ్యాహ్నం లోపు ఎండలో అల్ట్రా వయోలెట్-బి (UVB) కిరణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలో విటమిన్ డి ఉత్పత్తికి బాగా సహాయపడతాయి. అయితే, మండుటెండల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల వడదెబ్బ, చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి మితంగానే ఎండ తగిలేలా జాగ్రత్త పడాలి.
విటమిన్ డి లోపం ముప్పు ఎవరికి ఎక్కువ..?
రోజంతా ఇంట్లో లేదా ఆఫీసులో గడిపేవారికి.
వయసు పెరిగేకొద్దీ చర్మం విటమిన్ డిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది.
ముదురు రంగు చర్మం ఉన్నవారికి.
శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించేవారికి.
ఊబకాయం, కాలేయ (liver), కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి.
ఎండతో పాటు ఆహారం కూడా ముఖ్యమే..!
విటమిన్ డి కోసం కేవలం ఎండపైనే ఆధారపడకుండా తీసుకునే ఆహారం పైనా దృష్టి పెట్టాలి. గుడ్డు సొన, ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్ వంటి చేపలు , పాలు, పెరుగు, తృణధాన్యాలను మీ రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. లోపం మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహాతో మాత్రమే సప్లిమెంట్లు వాడాలి.
లోపాన్ని ఎలా గుర్తించాలి..?
తరచూ నీరసంగా అనిపించడం, ఎముకలు లేదా కండరాల నొప్పులు, తీవ్రమైన బలహీనత, పదేపదే అనారోగ్యానికి గురికావడం వంటివి విటమిన్ డి లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి '25-హైడ్రాక్సీ విటమిన్ డి' (25-hydroxy Vitamin D) రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టుల ఆధారంగా వైద్యులు తగిన చికిత్స సూచిస్తారు.
ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..
ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్నెస్ మీ సొంతం..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
