పోషకాహారలోపం వల్ల ఎలాంటి నష్టాలున్నాయి..?
సాక్షి లైఫ్ : ఓ నివేదిక ప్రకారం 1990- 2022 మధ్య, ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువుతో బాధపడుతున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి నిష్పత్తి బాలికలలో దాదాపు ఐదవ వంతు తగ్గింది. అబ్బాయిలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉంది. అదే కాలంలో తక్కువ బరువుతో బాధపడుతున్నపెద్దల నిష్పత్తి కూడా సగానికి పైగా తగ్గింది.
ఇది కూడా చదవండి.. క్యాన్సర్ కు సరికొత్త ఔషధం.. పరిశోధనలో గొప్ప విజయం..రూ.100కే టాబ్లెట్..
రెండూ పోషకాహార లోపంతోనే..
అంతేకాదు ఊబకాయం, తక్కువ బరువు, రెండూ పోషకాహార లోపంతోనే తలెత్తినట్లు అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు సమస్యలూ అనేక విధాలుగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని, తాజా అధ్యయనం తెలిపింది. గత 33 ఏళ్లుగా పెరిగిన పోషకాహార లోపం వల్ల తక్కువ బరువు కలిగి ఉండడం, అధిక బరువు కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, కాబట్టి ఈ రెండు సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కొత్త అధ్యయనం. అధిక బరువు సమస్య ప్రజల్లో పెరిగిపోయిందని, ఇది దీర్ఘకాలిక వ్యాధులకు సూచికగా కూడా పరిగణించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. మధుమేహానికి ప్రధాన కారణాలు ఈ 7 'S' లే..
ఆరోగ్య నిపుణులు..
1990 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం రేట్లు దాదాపు అన్ని దేశాలలో పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలలో కూడా అధిక బరువు పెరిగినట్లు పరిశోధకులు ఈ అధ్యయనం ద్వారా కనుగొన్నారు.
తీవ్రమైన వ్యాధులు పెరగడానికి కారణాలు..?
అధిక బరువు సమస్య చాలా వ్యాధులకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటుతోపాటు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్లలలో ఊబకాయ సమస్య మరింత తీవ్రమైనదని, ఇది వారి జీవన నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బులు,మధుమేహం సమస్యలకు ప్రధాన కారణం ఊబకాయం. అధిక బరువును నియంత్రించకపోతే అది మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మూడు దశాబ్దాల్లో నాలుగు రెట్లు పెరిగిన స్థూలకాయ సమస్యలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
